ముదిరిన అమరన్ సినిమా వివాదం.. తమిళనాడులో థియేటర్‌పై పెట్రోల్ బాంబు: ఎందుకంటే?

ముదిరిన అమరన్ సినిమా వివాదం.. తమిళనాడులో థియేటర్‌పై పెట్రోల్ బాంబు: ఎందుకంటే?

శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన మూవీ అమరన్. దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ రియల్ లైఫ్ స్టోరీతో తెరకెక్కిన అమరన్ సినిమాపై కొన్ని రోజులుగా వివాదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అమరన్ మూవీ ప్రదర్శించబడుతున్న థియేటర్లో.. ఓ గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ బాంబు విసిరాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మేళప్పళయం ప్రాంతంలోని అలంకార్ థియేటర్‌పై ఇవాళ (నవంబర్ 16)  తెల్లవారుజామున ఓ వ్యక్తి పెట్రోల్ బాంబు విసిరారు. అయితే కొద్దిరోజుల నుంచి అమరన్ సినిమాకు వ్యతిరేకంగా నిరసనలు జరగడం గమనార్హం.

ఈ క్రమంలో సినిమా థియేటర్ ప్రాంగణం ముందు బాంబు విసిరిన ఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది. అదృష్టవశాత్తూ అక్కడెవ్వరు లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని సమాచారం. ఈ సంఘటనపై ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని.. విచారణ కొనసాగుతోందని తిరునల్వేలి జిల్లా పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read : కంగువకు తెలుగులోనే ఎక్కువ కలెక్షన్స్

అమరన్ సినిమా వివాదం:

ఈ మూవీలో కాశ్మీరీలను తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ.. వివిధ సంస్థల నుండి వ్యతిరేకత వస్తోంది. ఇపుడు థియేటర్ ముందు జరిగిన పెట్రోల్ బాంబు దాడి ఈ నిరసనలతో ముడిపడి ఉన్నట్లు సమాచారం. పెట్రోల్ బాంబు ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. త్వరలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. 

అమరన్ వసూళ్లు:

అక్టోబర్ 31 దీపావళి కానుకగా థియేటర్ లో రిలీజైన ఈ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా రూ. 172 కోట్లు నెట్, అలాగే రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం మూడో వారం సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో రన్ అవుతోంది.