ఏపీలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్.. చంద్రబాబు ప్రకటన

ఏపీలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్.. చంద్రబాబు ప్రకటన

భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయనతో ఉన్న అనుబంధాన్ని, భారత పారిశ్రామిక రంగానికి ఆయన చేసిన సేవల్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

త్వరలో ఏపీ రాజధాని అమరావతిలో 'రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్' స్థాపించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ట్వీట్ చేశారు. ఈ హబ్ ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎకోసిస్టమ్, మెంటర్ స్టార్టప్‌లను ప్రోత్సహిస్తుందని చంద్రబాబు అన్నారు. ఈ హబ్ ఐదు ఇతర జోనల్ కేంద్రాలకు అనుసంధానించబడుతుందని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న రంగాలలో సాంకేతికత, నైపుణ్యాల మెరుగుదలని ఈ హబ్ సులభతరం చేస్తుందని చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.

86 ఏళ్ల రతన్ టాటా అక్టోబర్ 9న నగరంలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో కన్నుమూశారు. ఈయన మరణాంతరం టాటా ట్రస్ట్స్ కొత్త ఛైర్మన్‌గా నోయెల్ టాటాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ALSO READ | చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి బలం: డిప్యూటీ సీఎం పవన్..