ఆకాశంలో అద్భుతం: ఐదు ప్రపంచ రికార్డులు నెలకొల్పిన అమరావతి డ్రోన్ షో

ఆకాశంలో అద్భుతం: ఐదు ప్రపంచ రికార్డులు నెలకొల్పిన అమరావతి డ్రోన్ షో

జాతీయ స్థాయి డ్రోన్ సమ్మిట్‌‎లో భాగంగా ఆంధ్రప్రదేశ్‎లోని విజయవాడలో ఏర్పాటు చేసిన అమరావతి డ్రోన్ షో అట్టహాసంగా జరిగింది. కృష్ణా నది తీరంలోని పున్నమి ఘాట్‌లో 5,500 డ్రోన్‌లతో భారీ ప్రదర్శన చేశారు. డ్రోన్‌ షోతో పాటు ప్రేక్షకుల కోసం లేజర్‌ షోను ఏర్పాటు చేశారు. డ్రోన్‌ లైటింగ్‌ ద్వారా ఆకాశంలో వివిధ ఆకృతులు ప్రదర్శించడంతో కృష్ణా నది తీరం డ్రోన్ లైట్ వెలుగులతో కళ్లు జిగేల్‎మనిపించింది. సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ స్థాయి డ్రోన్ సమ్మిట్‌‎లో భాగంగా అమరావతి డ్రోన్‎ షోను ప్రారంభించారు.

ALSO READ | మహిళలకు శుభవార్త.. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు

కృష్ణ నది తీరంలో ఆకాశంలో ఆవిష్కృతమైన ఈ అద్భుతాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. డ్రోన్ లైట్ల వెలుగులు, జనసందోహంతో పున్నమి ఘాట్‎లో పండగ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే.. అమరావతి డ్రోన్ షో ఐదు ప్రపంచ గిన్నిస్ రికార్డులు నెలకొల్పింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు రికార్డ్‎లకు సంబంధించిన పత్రాలను అందించారు. దీంతో ఐదు గిన్నిస్ రికార్డులతో అమరావతి డ్రోన్ షో చరిత్ర సృష్టించింది

అమరావతి డ్రోన్ షో సృష్టించిన ఐదు రికార్డ్‎లు:

  • లార్జెస్ట్ ప్లానెట్ ఆకృతి
  • నదీ తీరాన లార్జెస్ట్‌ ల్యాండ్ మార్క్‌
  • అతిపెద్ద ఏరియల్‌ లోగో ఆకృతి
  • అతిపెద్ద జాతీయ జెండా ఆకృతి
  • అతిపెద్ద విమానాకృతి