
ఏపీకి అమరావతే రాజధానిగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. హాలహర్వి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర.. ఇవాళ ఆలూరు సరిహద్దుకు చేరుకుంది.
ఈ క్రమంలో అమరావతి రైతులు రాహుల్ బస చేస్తున్న శిబిరం దగ్గరకు వెళ్లి వినతిపత్రం అందించారు. రైతుల పోరాటానికి సంఘీభావం తెలుపుతున్నానని రాహుల్ చెప్పారు. వారికి న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమలుచేస్తామని రాహుల్ భరోసా ఇచ్చారు.