హక్కుల సాధనకు గౌడ కులస్తులు పోరాడాలి : అమరవేణి నర్సాగౌడ్

మంచిర్యాల/నేరడిగొండ, వెలుగు: హక్కుల సాధనకు గౌడ కులస్తులు ఐక్యంగా పోరాడాలని మోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రం జన్మభూమి నగర్​లోని చార్వక ట్రస్ట్ భవన్​లో గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జిల్లా ముఖ్యుల సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు దుర్గం రాజేశ్వర్ గౌడ్ అధ్యక్షుతన జరిగిన సమావేశంలో నర్సాగౌడ్ మాట్లాడుతూ.. గౌడ కులస్తులు రాజకీయ పార్టీలకు అతీతంగా కల్లు గీత వృత్తి రక్షణ, రాజ్యాధికారం సాధనకు ఐక్యంగా ఉద్యమించాలన్నారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌడ కులస్తులు భారీ సంఖ్యలో పోటీ చేసి గెలువాలని కోరారు. అనంతరం మోకుదెబ్బ జాతీయ కమిటీ 2025 క్యాలెండర్​ను ఆవిష్కరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ నిలకంటేశ్వర్ రావు గౌడ్, జవ్వాజి అనిల్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి బాలసాని శ్రీనివాస్ గౌడ్, నాయకులు కొండా మురళీ గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఒళ్లాల నర్సా గౌడ్, ప్రధాన కార్యదర్శి పోడేటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గోల్కొండ రవి, మడిపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు, గౌడ కులస్తులు పాల్గొన్నారు.

కుల వృత్తి రక్షణకు ఉద్యమిద్దాం

కుల వృత్తి రక్షణ కోసం ఐక్యంగా ఉద్యమిద్దా మని నర్సాగౌడ్ అన్నారు. నేరడిగొండ మండల కేంద్రంలో మోకు దెబ్బ బోథ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ జాతీయ కమిటీ నూతన క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు.