అమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్ చౌదరి 'సుమతీ శతకం' మూవీ షురూ

అమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్ చౌదరి 'సుమతీ శతకం' మూవీ షురూ

అమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్ చౌదరి హీరోగా కొత్త చిత్రం ప్రారంభమైంది. ఎంఎం నాయుడు దర్శకత్వంలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్నారు. సాయిలీ చౌదరి హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. ‘సుమతీ శతకం’ టైటిల్‌‌‌‌‌‌‌‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ప్రకటిస్తూ.. అమరావతిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ముహూర్తం షాట్‌‌‌‌‌‌‌‌కు పెదకూరపాడు ఎమ్మెల్యే  భాష్యం ప్రవీణ్ క్లాప్ కొట్టగా, వెన్నా సాంబశివారెడ్డి కెమెరా స్విచాన్ చేశారు.  

ఈ కార్యక్రమంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరై మూవీ టీమ్‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.  యూత్‌‌‌‌‌‌‌‌ఫుల్, రొమాంటిక్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు మేకర్స్ చెప్పారు. బండారు నాయుడు కథను అందించగా, సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్నాడు.