ప‌టియాలాలో నా గెలుపు ఖాయం

పంజాబ్ ఎన్నికల్లో పటియాలా నుంచి పోటీ చేస్తున్న మాజీ సీఎం అమరీందర్ సింగ్ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో  గెలుస్తామని భావిస్తున్నానని అన్నారు. కాంగ్రెస్‌ను వీడి పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను స్థాపించిన అమరీందర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వేరే ప్రపంచంలో జీవిస్తూ తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. దేశ వ్యతిరేకి అయిన భగవంత్ మాన్ కు.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతు ఇస్తున్నార‌ని అన్నారు. 

అమరీందర్ సింగ్ పాటియాలాలో ఓటు వేశారు. తమ పార్టీ మంచి పనితీరు కనబరుస్తోందని, క్షేత్రస్థాయిలో సానుకూల నివేదికలు వస్తున్నాయని చెప్పారు. ఈసారి రాష్ట్రం బ‌హుముఖ పోటీని చూస్తోంద‌న్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఎమ్మెల్యే రాజాసింగ్పై ఎఫ్ఐఆర్