పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అమరీందర్

పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అమరీందర్

అమృత్సర్: పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా అమరీందర్ సింగ్ రాజా వారింగ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ బాధ్యతలు చేపట్టిన అతిపిన్న వయస్కుడిగా ఆయన రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా అమరీందర్ రాజా మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతానన్నారు. క్రమశిక్షణ, అంకితభావంతో పని చేసి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తానన్నారు. అమరీందర్ తోపాటు భరత్ భూషణ్ అశూ కూడా బాధ్యతలు స్వీకరించారు. పంజాబ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా భరత్ అశూ బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన నేతలతోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు. 

ఇకపోతే, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. అప్పట్నుంచి పంజాబ్ ఛీప్, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఖాళీగానే ఉన్నాయి. తాజాగా వీటిని అమరీందర్ రాజా, భరత్ అశూతో పార్టీ అధినాయకత్వం భర్తీ చేసింది.