సూర్యాపేట, వెలుగు : అయోధ్యలో రామ మందిరం నిర్మించడం ప్రతి హిందువుకు గర్వకారణమని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్య అన్నారు. ఈనెల 22న ప్రారంభం కానున్న మందిరానికి శుక్రవారం అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ద్వారా 200 క్వింటాళ్ల బియ్యాన్ని పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
రాములోరి కార్యానికి బియ్యం అందించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సుధాకర్ పీవీసీ అధినేత మీలా మహదేవ్, కక్కిరేణి చంద్రశేఖర్, పర్వతం శ్రీధర్, మీలా వాసుదేవ్, సింగిరి కొండ రవీందర్, ఈగ వెంకటేశ్వర్లు, నూక వెంకటేశం గుప్తా, మురళీధర్, సవరాల సత్యనారాయణ, పెద్దిరెడ్డి గణేశ్, మీలా వంశీ, పబ్బ ప్రకాశ్, రంగయ్య, ప్రభాకర్ పాల్గొన్నారు.