బోధన్, వెలుగు : బీఎస్పీ బోధన్ నియోజకవర్గ ఇన్చార్జి అమర్‌నాథ్‌బాబు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. టౌన్లో బుధవారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు.
పార్లమెంట్ఎన్నికల్లో బీఎస్పీ, బీఆర్ఎస్ కలిసి పనిచేయడం తనకు ఇష్టం లేకే పార్టీ నుంచి వైదొలుగుతున్నానన్నారు. ఏ పార్టీలో చేరాలనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.