
జమ్మూ: హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తున ఉన్న అమర్ నాథ్ పుణ్యక్షేత్ర వార్షిక యాత్ర జులై 3 నుంచి ఆగస్టు 9 వరకు కొనసాగనుం దని అధికారులు బుధవారం వెల్లడించారు. జమ్మూకాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా అధ్యక్షతన రాజ్‌భవన్ లో జరిగిన శ్రీ అమరనాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు 44వ సమావేశం లో యాత్ర షెడ్యూల్‌ను నిర్ణయించా రు.
ఈ సందర్భంగా ఎల్జీ షెడ్యూలును విడుదల చేశారు. యాత్రకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా, సాఫీగా సాగేలా చూస్తామని అధికారులు తెలిపారు. ఇటు అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం ట్రాక్ నుంచి, అటు గాందర్ బల్ జిల్లా బల్తాల్ నుంచి యాత్ర సమాంతరంగా మొదలవుతుందని చెప్పారు.