అమర్‌నాథ్ యాత్రకు బ్రేక్.. ఎందుకంటే?

అమర్‌నాథ్ యాత్రకు బ్రేక్.. ఎందుకంటే?

జూన్ 29 నుంచి అమర్‌నాథ్ యాత్ర  రెండు మార్గాల నుంచి ప్రారంభమైంది. ఈ యాత్ర ఆగస్ట్ 19న ముగుస్తోంది. అయితే భారీ వర్షాల కారణంగా జూలై 6 గుహ మందిరానికి రెండు మార్గాల్లో అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. శనివారం రాత్రి నుంచి బాల్తాల్, పహల్గాం మార్గాల్లో అడపాదడపా భారీ వర్షాలు కురుస్తుండటంతో యాత్రికుల భద్రతను నిర్ధారించడానికి ముందుజాగ్రత్త చర్యగా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 

ఇప్పటి వరకూ 1.50 లక్షలకు పైగా భక్తులు 3,800 మీటర్ల ఎత్తైన గుహ క్షేత్రాన్ని సందర్శించి, సహజసిద్ధంగా ఏర్పడిన మంచు లింగాన్ని దర్శించుకున్నారు. వాతావరణ శాఖతో సూచనలతో మళ్లీ అమర్ నాథ్ యాత్ర పునప్రారంభిస్తామని తెలిపారు.