అమర్ నాథ్ యాత్రకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

అమర్ నాథ్ యాత్రకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

అమర్ నాథ్ యాత్ర ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. రెండేళ్ల నుంచి కరోనా కారణంగా అమర్ నాథ్ యాత్రకు బ్రేక్ పడింది. అయితే కరోనా తగ్గడంతో ఈ ఏడాది నుంచి యాత్ర పునః ప్రారంభం అవుతోంది. జూన్ 30 నుంచి యాత్ర ప్రారంభం అవనుంది. ఆగస్టు 11 వరకు ఈ యాత్ర కొనసాగనుంది. మంచు కొండల్లో కొలువై ఉన్న శివయ్యను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో వస్తారు. ఈ ఏడాది 3 లక్షలకు పైగా భక్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అమర్ నాథ్ యాత్రకు వచ్చే యాత్రికులు తప్పకుండా ఆధార్ కార్డుగాని, ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ గానీ సమర్పించాల్సి ఉంటుంది.

మరో వైపు అమర్ నాథ్ యాత్రకు ముందు కశ్మిర్లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు కలకలం రేపుతున్నాయి. అమర్ నాథ్ యాత్ర కోసం చేపట్టిన తనిఖీల్లో కశ్మీర్ దోడా జిల్లాల్లో భద్రతా దళాలు ఓ ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. ఉగ్రవాది ఫరీద్ అహ్మద్ నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రీ స్వాధీనం చేసుకున్నారు. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.