ఖుషి నుంచి న్యూ అప్ డేట్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతలు నటిస్తున్న ‘ఖుషి’ కి సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ వచ్చేసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ మూవీ తెరెకెక్కుతోంది. మైత్రీ మేకర్స్ బ్యానర్‌‌పై రూపొందుతున్న ఈ మూవీ గురించి డైరెక్టర్ శివ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు. మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యిందని, తొందరలోనే తర్వాతి షెడ్యూల్ హైదరాబాద్‌‌లో ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. సమంత, విజయ్ దేవరకొండ, వెన్నెల కిశోర్, చిత్ర యూనిట్ సభ్యులకు థాంక్స్ చెబుతున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా 2022, డిసెంబర్ 23వ తేదీన విడుదల చేయనున్నట్లు గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. 

ఈ సినిమా చిత్రీకరణ గత కొన్ని రోజులుగా కాశ్మీర్ లో కొనసాగుతోంది. గత నెల 23వ తేదీ నుంచి కాశ్మీర్ లో రెగ్యులర్ చిత్రీకరణ చేశారు. అందమైన లోకేషన్స్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు సమాచారం. ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ సంతోషంగా ఉంది. కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో ప్రేమ కథ ఉంటుందని తెలుస్తోంది. ఇందులో సమంత.. సంప్రదాయ కుటుంబానికి చెందిన యువతిగా, విజయ్ స్టైలిష్ యూత్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అదే అర్థమౌతోంది. ఈ మోషన్ పోస్టర్ కు అభిమానుల నుంచి భారీగా స్పందన లభించింది. షూటింగ్ లో దిగిన ఫొటోలను సమంత సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియచేస్తోంది. 

మరిన్ని వార్తల కోసం : 

పవన్ పాత్రపై క్లారిటీ ఇచ్చిన హరీష్


టికెట్ రేట్ల పెంపుతో ఎవరికి నష్టం.?