వరంగల్ : కార్మికుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు హెల్త్ మినిస్టర్ హరీష్ రావు. మంగళవారం ఆయన వరంగల్ లో నిర్మిస్తున్న హెల్త్ సిటీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. బీజేపీది మాటల ప్రభుత్వమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల పేదలు బతికే పరిస్థితి లేదన్నారు. వరంగల్ లో అద్భుతంగా హెల్త్ సిటీ నిర్మాణం జరుగుతోందన్నారు. సంవత్సరంలోగా 24 అంతస్తులతో 2వేల పడకల పెద్ద ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. కార్మిక మాసోత్సవాల సందర్భంగా హనుమకొండ మెగా హెల్త్ కాంప్ ప్రారంభించారు మంత్రులు.