రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన విద్యార్థి అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ప్యాడి ఫిల్లింగ్ మిషన్ ను తయారు చేసి పేటెంట్ హక్కును పొందాడు. వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేటకు చెందిన విద్యార్థి మల్లారం అభిషేక్ రూపొందించిన ప్యాడీ ఫిల్లింగ్ మిషన్ కు కేంద్ర ప్రభుత్వం పేటెంట్ హక్కు జారీ చేసింది. అద్భుత ఆవిష్కరణ చేసిన అభిషేక్ ను జిల్లా కలెక్టర్ తోపాటు గైడ్ టీచర్ వెంకటేష్, ప్రధానోపాధ్యాయులు అభినందించారు.
ఇప్పటికే అభిషేక్ రూపొందించిన ప్యాడీ ఫిల్లింగ్ మిషన్ కు రాష్ట్ర, జాతీయస్థాయిలో అనేక బహుమతులు వచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు అభిషేక్. జపాన్ లోని జరిగే అంతర్జాతీయ సదస్సుకు కూడా ఎంపికయ్యాడు అభిషేక్.
హన్మాజిపేటకు చెందిన మర్రిపల్లి లక్ష్మీరాజం-రాజవ్వ దంపతుల కుమారుడు అభిషేక్. 2019లో హన్మాజీపేట జడ్పీహెచ్‌ఎస్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో ఇన్‌స్పైర్ పోటీల్లో భాగంగా ధాన్యాన్ని సులభంగా సంచుల్లో నింపేందుకు ప్యాడీ ఫిల్లింగ్ యంత్రాన్ని రూపొందించాడు. ముగ్గురు చేసే పనిని ఒక్కరే చేయవచ్చు.