నవరాత్రి ఉత్సవాల్లో దేశం లీనమైపోయింది. ఈ ఉల్లాసమైన సమయాల్లో, చాలా మంది పండుగను జరుపుకున్న విధానాలను తెలియజేస్తూ.. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇదే తరహాలో ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఇందులో ఓ మహిళ సైకిల్ తొక్కుతూ స్కిప్పింగ్ చేసే తాడుతో విన్యాసం చేస్తూ కనిపిస్తోంది. ‘స్కిప్పింగ్ ఇన్ మై స్టైల్’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయింది.
ఈ వైరల్ వీడియోలో.. రద్దీ లేని రోడ్డులో సైకిల్ తొక్కుతూ ఓ మహిళ స్కిప్పింగ్ చేస్తూ కనిపించింది. ఆమె గార్బా వేడుకల సమయంలో ధరించే సంప్రదాయ దుస్తులను ధరించింది. ఘాగ్రా, చోలీ, ఇతర ఆభరణాలు అలంకరించుకొని అందంగా కనిపించింది.
ఈ ప్రత్యేకమైన వేడుకకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడం ఇదేం మొదటిసారి కాదు. అంతకుముందు, కొంతమంది వ్యక్తులు సైకిళ్లపై గర్బా ఆడుతూ కనిపించిన వీడియో ఒకటి కూడా వైరల్ అయ్యింది. నగరంలో సూరత్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అన్ని వయసుల వారు సైకిల్ తొక్కుతూ వృత్తాకారంలో తిరుగుతూ భక్తితో గర్బా ఆడుతూ కనిపించారు.
నవరాత్రి తొమ్మిది రోజులలో, భక్తులు దుర్గాదేవికి తమ ప్రార్థనలు, ఉపవాసాలను ఆచరిస్తారు. నవరాత్రి పండుగ రాక్షస మహిషాసురుని ఓటమిని, చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది.