![Viral news: ఈ ఆవు ఉన్న రైతుకు డబ్బేడబ్బు..రోజుకు 82 లీటర్ల పాలు ఇచ్చే మేలుజాతి ఆవు](https://static.v6velugu.com/uploads/2025/02/amazing-this-cow-broke-the-national-record-by-giving-82-liters-of-milk_UMjCXnZ231.jpg)
సాధారణంగా ఇళ్లలో పెంచుకునే ఆవులు, గేదెలు రోజుకు ఎక్కువల ఎక్కువ 10లీటర్ల వరకు పాలు ఇస్తాయి. ఇక ఫాంలల్లో పెంచేవి ఆవు జాతి, పోషణ, పెంపకం, ఆరోగ్యం వంటి అనేక అంశాల ఆధారంగా ఆవులు రోజుకు ఇచ్చే పాల లీటర్లు ఇస్తాయి. పంజాబ్ లోని లూథియానాకు చెందిన ఓ మేలు జాతి ఆవు ఏకంగా రోజుకు 82 లీటర్లు పాలు ఇచ్చి అంతర్జాతీయ PDFA డైరీ అండ్ అగ్రికల్చర్ ఎక్స్‌పో పోటీల్లో ఈ ఆవు రికార్డు సృష్టించింది.
ఇప్పటి వరకు సంకర జాతి జెర్సీ ఆవు రోజుకు 8నుంచి10 లీటర్లు , బద్రి ఆవులు రోజుకు 5నుంచి7 లీటర్ల , హర్ధేను జాతి ఆవు రోజుకు 55నుంచి 60 లీటర్ల పాలు ఇస్తాయి. ఇక హోల్‌స్టెయిన్ అనే ఆవు జాతి సంవత్సరానికి 6,500 లీటర్లు పాలు ఇస్తుందని అంతర్జాతీయ PDFA డైరీ అండ్ అగ్రికల్చర్ ఎక్స్‌పో డేటా చెబుతోంది. కొన్ని ఆవులు సంవత్సరానికి 10,000 లీటర్లు పాలు కూడా ఇస్తాయి.
భారతదేశంలో అనేక మెరుగైన ఆవు జాతులు ఉన్నాయి. ఇవి ప్రజాదరణ పొందాయి. పశువుల పెంపకందారుల ఆదాయాన్ని కూడా పెంచుతాయి. ఆవుల సామర్థ్యం లెక్కగట్టేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ జంతు ప్రదర్శనలు నిర్వహించబడతాయి. పంజాబ్‌లోని లూథియానా జిల్లాలోని జాగ్రావ్‌లో ఇటీవల జరిగిన 18వ మూడు రోజుల అంతర్జాతీయ PDFA డైరీ అండ్ అగ్రికల్చర్ ఎక్స్‌పో రెండవ రోజున పాల పోటీలు జరిగాయి. ఈ ప్రదర్శనలో అనేక జంతువులు పాల్గొన్నారు. రకరకాల ఆవులు , గేదెలు వాటి పాల ఉత్పత్తి సామర్థ్యంతో అందరినీ ఆశ్చర్యపరిచాయి.
ఈ పోటీల్లో మోగా జిల్లాకు చెందిన హర్‌ప్రీత్ సింగ్ అనే HF జాతి ఆవు 24 గంటల్లో 82 లీటర్ల పాలు ఇచ్చి జాతీయ రికార్డు సృష్టించింది. మాన్సాలోని హీరా డైరీ ఫామ్ ఉత్తమ డైరీ ఫామ్ అవార్డును గెలుచుకుంది.