న్యూఢిల్లీ: ఇండియా నుంచి అమెజాన్ జరిపిన మొత్తం ఎగుమతుల విలువ ఇంకో ఐదేళ్లలో 80 బిలియన్ డాలర్ల (సుమారు రూ.6.7 లక్షల కోట్ల) కు చేరుకుంటుందని అమెజాన్ ఇండియా ప్రకటించింది. 2025 నాటికి 20 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.7 లక్షల కోట్ల) ను ఎగుమతి చేయాలని గతంలో టార్గెట్ పెట్టుకుంది.
ఈ టార్గెట్‌ను చేరుకున్నామని తెలిపింది. కొత్త టార్గెట్‌ను చేరుకోవడానికి ప్రభుత్వం, చిన్న బిజినెస్‌లు, డైరెక్ట్ టూ కన్జూమర్ బ్రాండ్లతో అమెజాన్ ఇండియా భాగస్వామ్యం కుదుర్చుకుందని ‘అమెజాన్ సంభవ్’ ఈవెంట్‌లో కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ఎమర్జింగ్ మార్కెట్స్) అమిత్ అగర్వాల్ అన్నారు. అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ 2015 లో ప్రారంభమైంది. ఇప్పటివరకు 200లకు పైగా సిటీల నుంచి 1,50,000 మంది సెల్లర్లు రిజిస్టర్ చేసుకున్నారు.
15 నిమిషాల్లో అమెజాన్ ప్రొడక్ట్‌లు..
ఈ నెల చివరిలో ‘15 నిమిషాల్లోనే డెలివరీ సర్వీస్‌ల’ ను అమెజాన్ ఇండియా లాంచ్ చేయనుందని అమిత్ అగర్వాల్‌ను కోట్ చేస్తూ ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. మొదట బెంగళూరులో ఈ సర్వీస్‌లు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. 1,000–2,000 ప్రొడక్ట్‌లను 15 నిమిషాల్లో అమెజాన్ డెలివరీ చేస్తుందని పేర్కొంది. క్విక్ కామర్స్ సెగ్మెంట్‌లోకి ఈ ఈకామర్స్ కంపెనీ ఎంటర్ అవ్వాలని చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, మింత్రా ఈ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి.