Amazon & Flipkart Holi Sale 2023 : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో స్పెషల్ ఆఫర్స్

రంగుల పండుగ 'హోలీ' సమీపిస్తున్న నేపథ్యంలో ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ లలో ఆఫర్ సేల్ ప్రారంభం కాబోతుంది. వెరైటీ ఆఫర్లతో కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు పలు ఈ కామర్స్ దిగ్గజాలు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగా అతిపెద్ద ఆన్ లైన్ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లు కూడా పలు వస్తువులపై ఆఫర్లను, తగ్గింపులను ప్రకటిస్తున్నాయి. ఈ నెల మార్చి 8న హోలీ పండుగ సందర్భంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ హోలీ సేల్ 2023 ను ప్రకటించాయి. అమెజాన్ హోలీ సేల్ ఇప్పటికే ప్రారంభం కాగా... "హోలీ షాపింగ్ స్టోర్" కింద ల్యాప్‌టాప్‌లు, వస్తువులు, ఇతర పరికరాలపై అద్భుతమైన తగ్గింపులు చేస్తూ ఆఫర్లను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ ఈ సంవత్సరం హోలీ పండుగ కోసం "ఫ్లిప్‌చార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ 2023"ని ప్రకటించింది. ఈ రోజు నుండి సేల్ ప్రారంభం కానుండగా..  ఇది మార్చి 5 వరకు సాగనుంది. ఈ సేల్ లో వివిధ బ్రాండ్‌ల వస్తువులు దాదాపు1 లక్ష కంటే ఎక్కువ ఉత్పత్తులపై దాదాపు 80% తగ్గింపులను ఆ సంస్థ ప్రకటించింది.

అమెజాన్ హోలీ సేల్ 2023: ప్రయోజనాలు, ఆఫర్‌లు, డీల్‌లు, తగ్గింపులు

అమెజాన్ హోలీ సేల్ 2023 ప్రస్తుతం కొనసాగుతోంది. ఆర్గానిక్ రంగులు, ఫెర్రెరో రోచర్ చాక్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, అమెజాన్ ఉపకరణాలు లాంటి మరెన్నో ఉత్పత్తులపై అమెజాన్ ప్రస్తుతం 70% వరకు భారీ తగ్గింపును అందజేస్తోంది. అమెజాన్ షాపింగ్ అప్లికేషన్‌లో అందుబాటులో ఉన్న అమెజాన్ హోలీ స్టోర్‌ను యాక్సెస్ చేయడానికి 'అలెక్సా(Alexa)' సహాయం కూడా తీసుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది.

అమెజాన్ హోలీ సేల్ 2023 ఆఫర్‌లలో కొన్ని:

OnePlus Nord CE 2 Lite 5G: రూ. 18,999.

Samsung Galaxy M13: రూ. 10,999

ASUS Vivobook Pro 16 laptop (11th Gen Intel Core i9+ RTX 3050 graphics): Rs. 89,990

Amazon Echo Dot (3rd Gen): Rs 3,499

Amazon Fire TV Stick Lite: Rs 3,299

Amazon Kindle 2022: Rs 9,999

boAt Wave Edge samrtwatch: Rs 2,199

Amazon Basics Bluetooth neckband: Rs 489

boAt Rockerz 255 Pro+ Bluetooth neckband: Rs 1299

boAt Rockerz 103 Pro Bluetooth neckband: Rs 899

Sony Bravia 108 cm (43 inches) 4K Ultra HD Smart LED Google TV: Rs 42,990.

OnePlus 80 cm (32 inches) Y Series HD Ready LED Smart Android TV: Rs 14,999.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ 2023 - ఆఫర్‌లు & తగ్గింపులు:

ఈ సేల్ లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, దుస్తులు, టెలివిజన్‌లు లాంటి ఎన్నో  వస్తువులపై అద్భుతమైన తగ్గింపులను, ఆఫర్‌లను ఆ సంస్థ వెల్లడించింది. దాంతో పాటు బెడ్‌రూమ్, లివింగ్ రూమ్ ఫర్నిచర్‌తో లాంటి వస్తువులపై 70% తగ్గింపు. అలాగే ప్రీమియం ఫర్నిచర్‌పై 60% తగ్గింపు ఉండనుంది. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, టెలివిజన్ వంటి గృహోపకరణాలపై 60 నుండి 75% తగ్గింపు ఉండగా.. ఎయిర్ కండీషనర్లపై 55% తగ్గింపు ఉంటుంది. అత్యధికంగా అమ్ముడవుతున్న ల్యాప్‌టాప్‌లపైనా 45% తగ్గింపు ఉంది. Apple, Samsung, POCO, Realme వంటి స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన తగ్గింపులు ఉండనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే ప్రకటించగా.. స్మార్ట్‌వాచ్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, సౌందర్య ఉత్పత్తులు, దుస్తులు, వంటగది ఉపకరణాలు వంటి వాటిపైనా భారీ తగ్గింపులు ఉంటాయని తెలిపింది.

సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్ సిరీస్ iPhone 13,14 తాజా మోడళ్లపైనా భారీ తగ్గింపు ధరలను అందిస్తోంది. iPhone 13 అసలు ధర ₹61,999, కానీ దీనిని కేవలం ₹59,999కి కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా కస్టమర్‌లు తమ పాత స్మార్ట్‌ఫోన్‌ను కొత్త iPhone 13 కోసం మార్చుకోవడం ద్వారా అదనంగా ₹23,000 తగ్గింపును పొందవచ్చు. సాధారణంగా ₹71,999 ధర ఉండే iPhone 14 ఇప్పుడు కేవలం ₹67,999కి అందుబాటులో ఉంది.