
స్మార్ట్ టీవీ కొనాలనే ప్లాన్ చేస్తున్నారా..పెద్ద టీవీ కావాలి..ధర తక్కువగా ఉండాలి..అన్నీ ఫ్యూచర్స్ ఉండాలి..ధర మన రేంజ్లో ఉండాలని కోరుకునేవారికి గుడ్ న్యూస్..ఈ ఆఫర్స్ మీ కోసమే..IPL సీజన్ ప్రారంభం కావడంతో ప్రముఖ కంపెనీలతో సహా అన్ని టీవీ కంపెనీలు పెద్దపెద్ద ఆఫర్స్ ప్రకటించాయి. అంతా ఇంతా కాదు..రూ.20 వేల నుంచి రూ.60 వేల రూపాయల వరకు ఆయా టీవీలపై ధరలు తగ్గించాయి. ఏయే టీవీ కంపెనీలు, ఎంతెంత డిస్కౌంట్ ఇస్తున్నాయో తెలుసుకుందాం.
శామ్‌సంగ్ 43-అంగుళాల LED టీవీ
శామ్ సంగ్ 43-అంగుళాల LED స్మార్ట్ టీవీపై అమెజాన్ ఫ్లాట్ రూ.18వేల500 తగ్గింపును అందిస్తోంది. ఈ టీవీ అసలు ధర రూ. 49,990గా ఉండగా, ప్రస్తుతం జరుగుతున్న సేల్‌లో రూ. 31వేల490కి లభిస్తోంది.
సోనీ 55-ఇంచెస్ గూగుల్ టీవీ:
సోని 55ఇంచెస్ గూగుల్ టీవీ అసలు ధర రూ. 99వేల 900 ఉంది.. అయితే అమెజాన్ ప్లాట్ డిస్కౌంట్ తర్వాత రూ.57వేల 990కే లభిస్తోంది. అంటే రూ. 41వేల 910 ల భారీ డిస్కౌంట్ లభిస్తోంది.
TCL 55ఇంచెస్ QLED టీవీ
ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 1లక్షా20వేల990 గా ఉంది. అమెజాన్ డిస్కౌంట్. ఈ 55-అంగుళాల 4K QLED టీవీ ఇప్పుడు రూ. 36,990కి అందుబాటులో ఉంది.
Xiaomi 43ఇంచెస్ గూగుల్ టీవీ..
Xiaomi 43ఇంచెస్ గూగుల్ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 42వేల 999లుగా ఉంది. అయితే ఐపీఎల్ సందర్భంగా రూ.19వేల డిస్కౌంట్ తో కేవలం రూ.23వేల999 లకే లభిస్తుంది.
ALSO READ | 250 రూపాయలతో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్.. కోటక్ మహీంద్రా నుంచి చోటీ సిప్
LG 55ఇంచెస్ LED స్మార్ట్ టీవీ..
ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 71వేల 990 లు. డిస్కౌంట్ తర్వాత ధర రూ. 37వేల 740 లు..అంటే రూ. 33వేల డిస్కౌంట్ లభిస్తుంది.
Hisense 43-ఇంచెస్ గూగుల్ టీవీ:
ప్రారంభ ధర రూ. 49వేల 999 లు. ఈ 4K గూగుల్ టీవీ డిస్కౌంట్ తర్వాత రూ. 27వేల 499 ధరకు అందుబాటులో ఉంది.
Acer 55ఇంచెస్ గూగుల్ టీవీ
ఈ స్మార్ట్ టీవీ ప్రారంభ ధర రూ. 77వేల999. ఈ 55ఇంచుల 4K గూగుల్ స్మార్ట్ టీవీ ఇప్పుడు రూ. 35వేల999 లకే లభిస్తుంది.