ఈ-కామర్స్ మోసాలకు చెక్.. పలు చర్యలను ప్రకటించిన అమెజాన్

ఈ-కామర్స్ మోసాలకు చెక్.. పలు చర్యలను ప్రకటించిన అమెజాన్

హైదరాబాద్: ఆన్‌‌‌‌లైన్ షాపింగ్‌‌‌‌లో మోసాలకు అడ్డుకట్ట వేయడానికి బహుళ అంచెల విధానం అమలు చేస్తున్నామని ఈ–కామర్స్ కంపెనీ అమెజాన్ ​ప్రకటించింది. ప్రతి కొనుగోలు సురక్షితంగా ఉండేలా చూడటానికి అనేక టెక్నాలజీలను, కఠినమైన విధానాలను అవలంబిస్తున్నామని పేర్కొంది. ‘‘మోసపూరిత కార్యకలాపాలను ప్రారంభంలోనే గుర్తించడానికి  లేటెస్ట్​ అల్గారిథమ్‌‌‌‌లు, మెషీన్  లెర్నింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం.

అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడానికి ఈ వ్యవస్థలు నిరంతరం డేటాను పరిశీలిస్తాయి. ఉదాహరణకు, ఒకేసారి అనేక పెద్ద మొత్తంలో కొనుగోళ్లు జరిగినా, షిప్పింగ్ అడ్రస్​లు అసాధారణంగా ఉన్నా గుర్తిస్తాయి. మోసపూరిత వస్తువులను, నకిలీ వస్తువులను విక్రయించకుండా నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. కస్టమర్‌‌‌‌ మోసపోతే పరిహారం చెల్లిస్తున్నాం”అని అమెజాన్ ప్రకటించింది.