134 శాతం వృద్ధి సాధించిన గిఫ్టింగ్​ స్టోర్

134 శాతం వృద్ధి సాధించిన గిఫ్టింగ్​ స్టోర్

హైదరాబాద్​, వెలుగు: పండుగ బహుమతుల కోసం తమ ప్లాట్​ఫారమ్​లో ప్రారంభించిన బీ2బీ గిఫ్టింగ్ ​స్టోర్ మొదటి 10 రోజులలో  134 శాతం వార్షిక వృద్ధి సాధించిందని ఈ–కామర్స్​ సంస్థ అమెజాన్​ తెలిపింది. మొత్తం ఆర్డర్లు 95శాతం పెరిగాయని, కస్టమర్ల సంఖ్య 107శాతం పెరిగిందని పేర్కొంది. చాకొలెట్లు, డ్రై ఫ్రూట్స్  టీ అండ్​ కాఫీ హ్యాంపర్స్, గార్మెట్ బాక్స్ లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయని పేర్కొంది. ఉద్యోగులను గుర్తించడానికి, సహోద్యోగులతో సంబరాలు చేసుకోవడానికి కానుకలు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపింది. ఈ స్టోర్​లో 8,500కి పైగా ఉత్పత్తులను అమ్ముతున్నారు.

మరిన్ని వార్తలు