న్యూఢిల్లీ: ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఎమ్‌ఎక్స్ ప్లేయర్‌ను కొనుగోలు చేసి తమ కంటెంట్ స్ట్రీమింగ్ సర్వీస్ మినీ టీవీతో విలీనం చేసినట్లు అమెజాన్ సోమవారం తెలిపింది. ఇక నుంచి దీనిని 'అమెజాన్ ఎమ్‌ఎక్స్ ప్లేయర్'గా పిలుస్తారు.
డీల్విలువను అమెజాన్ వెల్లడించలేదు. ఎక్కువ మందికి నాన్‌ప్రీమియం వినోదాన్ని అందుబాటులోకి తీసుకురావడం ఈ విలీనం లక్ష్యమని తెలిపింది. ఎంఎక్స్ప్లేయర్ యాప్‌తో సహా ఎంఎక్స్ప్లేయర్కు చెందిన కొన్ని ఆస్తులను కొన్నామని ప్రకటించింది.