మారుతీ సుజుకి మిడ్ రేంజ్ కారు వేగనార్ మన దేశంలో 25వ బర్త్‌డేను జరుపుకుంది. దీనిని1999లో మొదటిసారిగా 'టాల్ బాయ్'గా కంపెనీ పరిచయం చేసింది. వరుసగా మూడు సంవత్సరాలుగా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డు సాధించిందని, ఇప్పటివరకు 32 లక్షల వేగనార్ కార్ల అమ్మామని మారుతీ తెలిపింది.
ఈ–కామర్స్ కంపెనీ అమెజాన్ క్రిస్మస్ సందర్భంగా తన ప్లాట్ఫామ్లో ప్రత్యేక స్టోర్‌ను లాంచ్చేసింది. ఇది డిసెంబర్ 25 వరకు అందుబాటులో ఉంటుంది. క్రిస్మస్ అలంకరణ సామగ్రి, హ్యాండ్ బ్యాగ్‌లు, స్మార్ట్ టెక్ యాక్సెసరీలు, క్రిస్మస్ దుస్తులతో సహా వివిధ విభాగాలలో లక్షలాది ఉత్పత్తులను ఇందులో కొనొచ్చు. అమెజాన్ ఐసీఐసీఐ పే కార్డుతో కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది.
క్వాలిటీ ఇంజనీరింగ్, డిజిటల్ ట్రాన్సిషన్సేవలు అందించే క్వాలిజిల్ హైదరాబాద్‌లో తమ కొత్త సెంటర్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. దీంతో కలుపుకుంటే క్వాలిజిల్ కేపబిలిటీ సెంటర్ల సంఖ్య మూడుకు చేరింది. కంపెనీ 2021లో తన కార్యకలాపాలను ఆరంభించింది. కొత్త సెంటర్లో రెండు వేల మంది పనిచేస్తారు. రాబోయే కొన్నేళ్లలో 130 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ తెలిపింది.
ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ పై ప్రాంతీయ పరిశోధనా సదస్సు గురువారం హైదరాబాద్‌లోని అనురాగ్ యూనివర్సిటీలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ జేఏ చౌదరి ముఖ్య అతిథిగా హాజరై సింపోజియంను ప్రారంభించారు. ఈ కార్యక్రమం మనదేశంలోని పీబీఎల్ పరిశోధకులను, విద్యావేత్తలను ఒకచోట చేర్చింది. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ విధానంలో విద్యార్థులు నిజ జీవిత సమస్యలను పరిష్కరించడం ద్వారా నేర్చుకుంటారు.
కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎర్లీ స్టేజ్ స్టార్టప్‌ల కోసం కోటక్ బిజ్ ల్యాబ్స్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. స్టార్టప్‌లు సవాళ్లను అధిగమించడానికి, వాటి వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహించేలా సహాయపడటానికి ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది.