అమెజాన్ ప్రైమ్ యూజర్స్ కి గుడ్ న్యూస్. తాజాగా ప్రమ్ లైట్ మెంబర్ షిప్ ధరలను ప్రకటించింది. రూ.999గా ఉన్న అమెజాన్ ప్రైమ్ సపోర్ట్ మెంబర్షిప్ ను రూ.799గా నిర్ణయించింది. అంతకుముందు ఈ మెంబర్ షిప్ నెలకు రూ.299, 3నెలలకు రూ.599, ఇయర్ ప్లాన్ రూ.1,499గా ఉండేది. ఆ తర్వాత ప్రైమ్ లైట్ ను జూన్ లో ప్రారంభించిన అమెజాన్.. రూ.999కు ప్లాన్ ధరలో కొన్ని మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది.
సాధారణ ప్రైమ్ మెంబర్ షిప్ తో పోలిస్తే.. ప్రైమ్ లైట్ మెంబర్ షిప్ కొంచెం తక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ఈ-కామర్స్ ప్లాట్ ఫారమ్ మెంబర్ షిప్ ధరను రూ.200 తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. ఇతర మెంబర్ షిప్ ప్లాన్ ల ధరల్లో ఎలాంటి మార్పు లేనట్టు తెలిపింది.
ఏమేం మారాయంటే..
ప్రైమ్ లైట్ మెంబర్ షిప్ వల్ల యూజర్స్ అనేక ప్రయోజనాలను అందుకుంటున్నారు. ఈ ప్లాన్ ను మరింత చౌకగా అందించేందుకు కంపెనీ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ధరతోపాటు ప్లాన్ లో కనిపించే మార్పుల విషయానికొస్తే..
ఉదాహరణకు, ముందుగా ప్లాన్‌లో రెండు రోజుల డెలివరీని ఉచితంగా అందించేవారు. ఇప్పుడు, ప్లాన్‌లో వన్-డే డెలివరీ, టూ-డే డెలివరీ, షెడ్యూల్డ్ డెలివరీ, సేమ్-డే డెలివరీ ఉన్నాయి.
ఇక ప్రైమ్ వీడియో క్వాలిటీని హెచ్ డీ కి పరిమితం చేయగా.. తాజా ధర తగ్గింపు వల్ల ఈ మెంబర్ షిప్ కేవలం ఒక యూజర్ కి మాత్రమే సపోర్ట్ చేయనుంది. ఇందులో భాగంగా ప్రతి వస్తువుపై రూ.175తో మార్నింగ్ డెలివరీ, నో-కాస్ట్ ఈఎంఐ, 6నెలల ఫ్రీ స్క్రీన్ రిప్లేస్మెంట్ వంటివి చాలానే ఉన్నాయి. అయితే ఈ ప్లాన్ వల్ల అన్ లిమిటెడ్ ప్రైమ్ వీడియో డివైజ్ సపోర్ట్ తో పాటు, 4కె రిజల్యూషన్ సపోర్ట్ ను కూడా యూజర్స్ కోల్పోనున్నారు.