అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సెలర్స్ ఇళ్లలో ఈడీ సోదాలు..దేశవ్యాప్తంగా 24 చోట్ల రైడ్స్

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సెలర్స్ ఇళ్లలో ఈడీ సోదాలు..దేశవ్యాప్తంగా 24 చోట్ల రైడ్స్

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తో సహా ప్రధాన ఈ కామర్స్ ప్లాట్ ఫాం లకు సంబంధించిన విక్రయదారులపై ఈడీ రైడ్స్ చేసింది. గురువారం ( నవంబర్ 7) దేశవ్యాప్తంగా ప్రధాన ఈ కామర్స్ విక్రేతలను లక్ష్యంగా చేసుకొని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్ ఆరోపణలతో ఈ దాడులు చేసింది. 

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ప్రముఖ ఆన్ లైన్ మార్కెట్లతో సంబంధం ఉన్న సెల్లర్స్ ( విక్రేతలు) ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలతో దాడులు చేశారు. 

దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ లో భాగంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరులోని  ఈ కామర్స్ దిగ్గజాల అనుబంధ సంస్థలతో పాలు పలువురి వ్యాపారస్తుల ఇళ్ళలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. 

Also Read : ఆస్తుల విక్రయానికి సుప్రీం కోర్టు ఆదేశాలు

ఈ ఏడాది సెప్టెంబర్ లో కూడా యాంటీ ట్రస్ట్ అథారిటీ జరిపిన దర్యాప్తుపలో అమెజాన్, వాల్ మార్ట్, ఫ్లిప్ కార్ట్ తమ ఫ్లాట్ ఫాంలపై నిర్థిష్ట విక్రేతలకు అనుకూలంగా చట్టాలను ఉల్లంఘించాయని తేలింది.