
బిజినెస్ డెస్క్, వెలుగు: ఆన్లైన్ షాపింగ్ సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరోసారి స్పెషల్ సేల్స్ మొదలుపెట్టాయి. రెండు కంపెనీలు ఎలక్ట్రానిక్స్‌పై భారీగా డిస్కౌంట్లు, ఆఫర్లు ఇస్తున్నాయి. కొన్ని బ్యాంకుల కార్డులపై అదనపు డిస్కౌంట్లు ఉంటాయి. రెండింట్లోనూ ఫోన్లపై ఎక్స్చేంజీ ఆఫర్లు ఉన్నాయి. అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్, ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ పేరుతో స్పెషల్ సేల్ మొదలయింది. స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు తగ్గింపుతో పాటు పాపులర్ స్మార్ట్ టీవీలపై 55 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. వన్‌ప్లస్, షావోమీ, రెడ్మీ, శామ్సంగ్, టెక్నో, కోడక్, ఒప్పో, రియల్‌మీ వంటి బ్రాండ్‌ల ప్రొడక్టులపై ఆఫర్లు, డిస్కౌంట్లు ఉన్నాయి. ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ సేల్ మార్చి 14, 2022 వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా అమెజాన్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్‌లు, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈఎంఐల సదుపాయమూ ఉంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు రూ. 20 వేల వరకు పొదుపు చేయవచ్చు. ఫోన్లపై ఆరు నెలల ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్ క్రెడిట్ కార్డ్‌లపై నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు ఉన్నాయి. పవర్ బ్యాంక్‌లపై 70 శాతం వరకు, వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లపై 60 శాతం వరకు తగ్గింపును అమెజాన్ అందిస్తోంది.
వన్‌ప్లస్9 సిరీస్ ఫోన్లపై ఆఫర్లు..
వన్‌ప్లస్ ప్రొడక్టులపై 10 శాతం నుంచి 14 శాతం వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. వన్‌ప్లస్ 9ఆర్, 9 ప్రొ, 9, నార్డ్ సీఈ2, వై సిరీస్ టీవీలూ తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. టెక్నో స్పార్క్ 8 ప్రొ ఫోన్ రూ.10 వేలకే వస్తోంది. కేమన్ 17 ఫోన్ ధర క్రెడిట్‌కార్డుల డిస్కౌంట్ వల్ల రూ.14 వేలకు తగ్గింది. పోవా 2 ఫోన్ ధర రూ.12 వేలకు దిగివచ్చింది. రియల్‌మీ నార్జ్ 50ఏని రూ.11,499లకు, నార్జో 50ని రూ.13 వేలకు అమ్ముతున్నారు. ఒప్పో ఏ15,31,74 ఫోన్లపైనా క్రెడిట్‌కార్డు, ఎక్స్చేంజ్ ఆఫర్లు ఉన్నాయి. శామ్సంగ్ గెలాక్సీ ఎం52ను ఈ ఆఫర్ సమయంలో రూ.25 వేలకు సొంతం చేసుకోవచ్చు. ఎం12 ఫోన్ ధర రూ.12,500లకు దిగింది. ఎం32 5జీ ఫోన్ ధర రూ.రెండు వేలు తగ్గడంతో రూ.21 వేలకు అమ్ముడవుతోంది. కోడక్4 కే టీవీని 28 శాతం డిస్కౌంట్‌తో రూ.31 వేలకు అమ్ముతున్నారు. అమెజాన్ బేసిక్స్ 55 ఇంచుల టీవీ ధరను 45 శాతం తగ్గించి రూ.36 వేలకు ఇస్తున్నారు. వ్యూ 32 టీవీ రూ.12,840 మాత్రమే. సోనీ బ్రావియా 55 ఇంచుల టీవీని రూ.75 వేలకు సొంతం చేసుకోవచ్చు.
స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్లు
రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ ప్రీపెయిడ్ ఆర్డర్‌లపై రూ. 3000 తగ్గింపును, రియల్‌మీ జీటీ కొనుగోలుపై రూ. 2000 ప్రీపెయిడ్ డిస్కౌంట్ దక్కించుకోవచ్చు. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్12 ధర 12,999 నుండి 9,799లకు తగ్గింది. మోటరోలా ట్యాబ్ జీ20 రేటు రూ.7199లకు దిగివచ్చింది. రియల్‌మీ సీ35 రేటు రూ. 11,999 కాగా, స్టేట్‌బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా రూ. 1000 తగ్గింపును పొందవచ్చు. ఐఫోన్ ఎస్ఈ (2020) ఎంఆర్పీ ధర రూ.40 వేలు కాగా ఇప్పుడు రూ.30 వేలకు అమ్ముతున్నారు. స్టేట్‌బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని కూడా వాడితే మరింత డిస్కౌంట్ వస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్ మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ ధర రూ. 20,499లకు తగ్గింది. స్టేట్‌బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి మరో రూ. 750 తగ్గుతుంది. పాత ఫోన్‌కు బదులుగా మోటరోలా ఫోన్‌ను కొంటే ట్రేడ్-ఇన్ డిస్కౌంట్ ఇస్తారు. పోకో ఎం3 ప్రో 5జీ ప్రారంభ ధర రూ.13 వేలు కాగా, బ్యాంక్ ఆఫర్‌తో 750 తగ్గుతుంది. ట్రేడ్-ఇన్ డిస్కౌంట్ సైతం పొందవచ్చు. శామ్సంగ్ 65 , 55, ఇంచుల 4కే టీవీలపైనా డిస్కౌంట్లు, ఆఫర్లు ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్‌లో ఇవీ ఆఫర్లు
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్డే శనివారం మొదలయింది. ఈ నెల 16న ముగుస్తుంది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌ట్యాప్స్, హోమ్ అప్లియెన్సెస్‌పై డిస్కౌంట్లు, ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్లు ఉన్నాయి. స్టేట్ బ్యాంకు కార్డులపై 10 శాతం అదనంగా డిస్కౌంట్ ఇస్తారు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్‌కార్డుతో కొంటే ఐదుశాతం డిస్కౌంట్ ఉంటుంది. రూ. 39,990 ధర ఉండే రియల్‌మీ బుక్ (స్లిమ్) కొనుగోలుపై ఫ్లాట్ రూ. 7000 తగ్గింపును అందిస్తోంది. రియల్‌మీ ప్యాడ్‌ను రిటైల్ ధర రూ. 13,999లకు బదులు రూ. 12,499లకు దక్కించుకోవచ్చు. లెనెవో ఐడియాపాడ్ ధరను 32శాతం తగ్గించి రూ. 37,990లకు అమ్ముతున్నారు. డెల్ వోస్ట్రో కోర్ ఐ3 11 జెనరేషన్ ల్యాప్ధరను రూ. 40,490లకు తగ్గించారు.