హైదరాబాద్, వెలుగు : ఆన్లైన్లో పండ్లు, కూరగాయలు, పిల్లల ఉత్పత్తులు, బ్యూటీ, బేబీ, పర్సనల్ కేర్, పెట్ ఉత్పత్తుల వంటివి అమ్మే అమెజాన్ ఫ్రెష్ సేవలు హైదరాబాద్ సహా 130కిపైగా నగరాలకు విస్తరించినట్లు ఈ–కామర్స్ కంపెనీ అమెజాన్ప్రకటించింది. తాము పండ్లను, కూరగాయలను 11 వేల మంది పైగా రైతుల నుంచి సేకరిస్తామని, వాటి నాణ్యతను నాలుగు -దశల్లో పరిశీలిస్తామని తెలిపింది.
అమెజాన్ ఫ్రెష్ సెల్లర్స్ బ్యాంకుల నుంచి ఎన్నో డీల్స్ పొందుతారని పేర్కొంది. అమెజాన్ ఫ్రెష్ డైరెక్టర్ శ్రీకాంత్ శ్రీరామ్ మాట్లాడుతూ తమ ద్వారా కిరాణా వస్తువులు కొనే కస్టమర్స్ క్యాష్ బాక్, ఆఫర్స్, బ్యాంక్ డిస్కౌంట్స్ వంటి ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని చెప్పారు.