ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ ప్రకటన రానే వచ్చింది. ఇందులో భాగంగా అమెజాన్ భారతీయ స్టేట్ బ్యాంకు క్రెడిట్ కార్డు కలిగివున్నవారికి భారీ మొత్తంలో డిస్కౌంట్లు ప్రకటించింది. అలాగే ప్రైమ్ మెంబర్షిప్ ఉన్నవారికి ముందస్తుగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌ను యాక్సెస్ సదుపాయం కలిగిస్తోంది.
అయితే ఈ సేల్ లో భాగంగా కొనుగోలుదారులు ల్యాప్‌టాప్‌లపై 45 శాతం వరకు తగ్గింపు మరియు ఎలక్ట్రానిక్స్ మరియు ఉపకరణాలపై 75 శాతం వరకు తగ్గింపును పొందగలరు. అంతేగాకుండా ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, మొబైల్‌లు మరియు గేమింగ్ పరికరాలు, అలాగే ఇతర లైఫ్ స్టైల్ ఉత్పత్తుల వంటి వాటిపై తగ్గింపులను సూచించే ప్రత్యేక మైక్రోసైట్‌ను రూపొందించింది. ఈ క్రమంలో యాపిల్, డెల్, లెనోవో, షావోమి తదితర ప్రాడక్ట్స్ పై పెద్ద మొత్తంలో డిస్కౌంట్లు లభించనున్నాయి.
ఇక అమెజాన్ ద్వారా భారతీయ స్టేట్ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ కలిగినవారు సెలెక్ట్ చేసిన ఉత్పత్తులపై 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఈ సేల్‌లో ట్యాబ్లెట్‌లపై 60 శాతం, సెల్ ఫోన్లు మరియు యాక్సెసరీలపై 40 శాతం, హెడ్‌ఫోన్‌లపై 70 శాతం, స్మార్ట్ టీవీలు మరియు ప్రొజెక్టర్లపై 60 శాతం, గేమింగ్‌పై 70 శాతం వరకూ డిస్కౌంట్లు పొందే అవకాశం ఉంటుంది. ఇవేకాకుండా నో-కాస్ట్ ఈఎంఐ అమెజాన్ పే, పే లేటర్ మరియు కూపన్ డిస్కౌంట్‌లు కూడా సేల్ సమయంలో అందుబాటులో ఉండనున్నాయి.