అమెజాన్ ఫెస్టివల్ సేల్: ట్యాబ్లెట్లపై 60శాతం తగ్గింపు

అమెజాన్ ఫెస్టివల్ సేల్: ట్యాబ్లెట్లపై 60శాతం తగ్గింపు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా ఈ కామర్స్ దిగ్గజం టాబ్లెట్ పీసీలతో సహా స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ గూడ్స్ పై భారీ డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన డీల్స్ ను అందిస్తోంది. కస్టమర్లకు కావాల్సిన వివిధ రకాల టాబ్లెట్ మోడళ్లపై 60 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది. 

ప్రఖ్యాత బ్రాండ్లు, తయారీదారుల నుంచి టాబ్లెట్‌లపై గణనీయమైన ధర తగ్గింపు ఈ సేల్ ప్రత్యేకతలు. తక్కువ బడ్జెట్ లో టాబ్లెట్ పీసీలను కావాలనుకునేవారికి ఈ సేల్ లో 60 శాతం డిస్కౌంట్ తో కొనుగోలు చేసేందుకు మంచి అవకాశం కల్పిస్తోంది.

Samsung Galaxy Tab S6 Lite

Samsung Galaxy Tab S6 Lite  అద్భుతమైన మల్టీమీడియా అనుభవాన్ని అందించే ఫీచర్ -ప్యాక్డ్ టాబ్లెట్. 10.4-అంగుళాల TFT డిస్‌ప్లే , డాల్బీ అట్మాస్ సౌండ్‌తో సినిమాలు, వీడియోలు చూడటానికి సరైనది. టాబ్లెట్ స్లిమ్, తేలికైనది, సున్నితమైన పనితీరు కోసం ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో తయారు చేశారు. ఇది 7,040mAh బ్యాటరీతో సుదీర్ఘంగా పనిచేస్తుంది. 8MP వెనక కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరాలు ఉంటుంది. ఫోటోగ్రఫీ, వీడియో కాల్‌లకు సౌకర్యంగా ఉంటుంది. Samsung  నాక్స్ భద్రతతో మీ డేటా బాగా రక్షించబడుతుంది. ఇది ఆండ్రాయిడ్ 12 వెర్షన్ కలిగి ఉటుంది. ఈ సేల్ లో Samsung Galaxy Tab S6 Lite 1-సంవత్సరం వారంటీతో కూడా ఇస్తున్నారు.

Samsung Galaxy Tab S6 Lite స్పెసిఫికేషన్‌లు:

డిస్ ప్లే: 26.31cm (10.4-అంగుళాల) TFT, 16M రంగులు
ప్రాసెసర్: ఆక్టా-కోర్
RAM: 4 GB
ROM: 64 GB
బ్యాటరీ: 7,040mAh
కెమెరాలు: 8MP (బ్యాక్ కెమెరా), 5MP ఫ్రంట్ కెమెరా)
ఆడియో: డ్యూయల్ స్పీకర్లు, AKG, డాల్బీ అట్మోస్
S పెన్ సపోర్ట్: ఉంది
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 12
వారంటీ: 1 సంవత్సరం
దీని ఒరిజినల్ ధర: 30,999, డిస్కౌంట్ తర్వాత రూ. 19,999

Xiaomi ప్యాడ్ 6 అనేది పని, వినోదం రెండింటి కోసం రూపొందించబడిన పవర్‌హౌస్ ట్యాబ్లెట్. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్, 144Hz 2.8K డిస్‌ప్లే, 8GB RAM ని కలిగి ఉంది. 11-అంగుళాల స్క్రీన్ 1 బిలియన్ రంగులతో డాల్బీ విజన్, అట్మాస్ సపోర్ట్ అద్భుతమైన విజువల్స్, ఆకట్టుకునే ఆడియోను అందిస్తుంది. క్వాడ్ స్పీకర్లు మల్టీమీడియా అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. 8840mAh దీర్ఘకాలిక బ్యాటరీ, ఫోకస్ ఫ్రేమ్‌తో కూడిన 8MP ఫ్రంట్ కెమెరా, 13MP బ్యాక్ కెమెరా అద్భుతమైన ఫోటోగ్రఫీని అందిస్తుంది.  MIUI 14తో Android 13ఆపరేటింగ్ సిస్టమ్, యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్ , సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది.
 

Xiaomi ప్యాడ్ 6 స్పెసిఫికేషన్‌లు:

డిస్ ప్లే:  27.9cm (11-అంగుళాల) 2.8K, 144Hz
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 870, అడ్రినో 650
RAM: 8GB వరకు
ROM: 256GB
బ్యాటరీ: 8840mAh
కెమెరాలు: 8MP ఫ్రంట్, 13MP వెనుక
ఆడియో: క్వాడ్ స్పీకర్లు, డాల్బీ అట్మోస్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 13, MIUI 14
దీని ఒరిజినల్ ధర రూ. 41,999 కాగా.. డిస్కౌంట్ తో రూ. 25,999 లకు వస్తోంది.  

టాబ్లెట్ పీసీలు మన డిజిటల్ లైఫ్ లో ఒక భాగమై పోయాయి. స్కీన్ టచ్ లతో కూడిన ఈ హ్యాండ్ హోల్డ్ కంప్యూటర్లు అనేక ఎడ్యుకేషన్, ఆఫీస్ పనులు,  ఎంటర్ టైన్ మెంట్  ద్వారా నిత్య జీవితంలో వివిధ అంశాల్లో ఉపయోగకరంగా ఉంటాయి. అవి పోర్టబిలిటీ, యూజర్ ఫ్రెండ్లీ టచ్ ఆధారిత ఇంటర్‌ఫేస్, ల్యాప్‌టాప్‌లతో పోలిస్తే పొడిగించిన బ్యాటరీ లైఫ్ , ఎక్కడికి వెళ్లినా కనెక్ట్ అయ్యే సౌలభ్యాన్ని అందిస్తాయి.