స్మార్ట్ఫోన్ కొంటే ఇయర్ బడ్స్ ఫ్రీ.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో బంపర్ ఆఫర్

స్మార్ట్ఫోన్ కొంటే ఇయర్ బడ్స్ ఫ్రీ.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో బంపర్ ఆఫర్

సెప్టెంబర్ 27 నుంచి మొదలుకానున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్పై బంపర్ ఆఫర్ అందుబాటులోకి రాబోతోంది. ఈ సేల్లో వన్ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ (OnePlus Nord CE4 Lite 5G) స్మార్ట్ ఫోన్ను కొనే వారికి 1,599 రూపాయల విలువైన వన్ ప్లస్ నార్డ్ 2r బడ్స్ ఫ్రీగా ఇవ్వనున్నట్లు అమెజాన్ పేర్కొంది.

బ్యాంక్ కార్డులపై డిస్కౌంట్ పోను 16,999 రూపాయలకు అమెజాన్ సేల్లో వన్ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ను సొంతం చేసుకోవచ్చు. 6.6 అంగుళాల అమోల్డ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్ (FHD+), స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫీచర్లు వన్ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్పై ఆసక్తి రేపుతున్నాయి.

ALSO READ | మివీ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాడ్స్ వచ్చేశాయ్​

ప్రైమ్ మెంబర్లకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 26 అర్థరాత్రి నుంచే మొదలుకానుంది. ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ను అమెజాన్ ప్రకటించింది. స్మార్ట్ ఫోన్లపై, వాషింగ్ మెషీన్లపై, రిఫ్రిజిరేటర్లపై ఈ సేల్లో భారీ తగ్గింపునకు అమెజాన్ తెరలేపింది. దసరా పండుగ నేపథ్యంలో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ను తీసుకురావడం గమనార్హం.