
హైదరాబాద్, వెలుగు: ఆన్లైన్ మార్కెట్ ప్లేస్అమెజాన్ ఇండియా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి గ్రేట్ సమ్మర్ సేల్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ప్రైమ్ మెంబర్లకు ఒక రోజు ముందే ఇది అందుబాటులో ఉంటుంది. శామ్సంగ్, టీసీఎల్, హైసెన్స్, టాటా, హెచ్యూఎల్, కెల్లాగ్స్, బోట్ప్రొడక్టులపై భారీ ఆఫర్లు ఉంటాయని తెలిపింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు, ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై 10 శాతం ఇన్స్టంట్డిస్కౌంట్ఇస్తారు. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ డెకర్, కిచెన్ ఎసెన్షియల్స్పై 80 శాతం వరకు తగ్గింపు ఉంటుంది. మొబైల్స్ యాక్సెసరీస్‌పై 40 శాతం వరకు, ల్యాప్‌టాప్‌లపై 45శాతం వరకు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్‌లపై 80శాతం వరకు, టీవీలు, ప్రొజెక్టర్లపై 65శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. అమెజాన్‌పే–ఐసీఐసీఐ కార్డుపై ఐదు శాతం డిస్కౌంట్ ఉంది.