అమెజాన్​లో కిరాణా సరుకులపై భారీ ఆఫర్లు

అమెజాన్​లో  కిరాణా సరుకులపై భారీ ఆఫర్లు

హైదరాబాద్​, వెలుగు : ఈ నెల 1‌‌‌‌‌‌‌‌–7 తేదీల మధ్య నిర్వహిస్తున్న  సూపర్​వాల్యూ డేస్​లో కిరాణా సరుకులపై పలు ఆఫర్లు ఇస్తున్నామని ఈ–కామర్స్​సంస్థ అమెజాన్​ ప్రకటించింది. తాజా పండ్లు  కూరగాయలు మొదలుకుని స్నాక్స్, పానీయాలు,  నిత్యావసరాల వరకు ఎన్నో ఉత్పత్తులపై 45శాతం తగ్గింపు ఉంటుందని తెలిపింది.

పండ్లు  కూరగాయలను కొనుగోలు చేస్తే రూ. 200 వరకు క్యాష్‌‌‌‌బ్యాక్ పొందవచ్చని, కొత్త అమెజాన్ కస్టమర్‌‌‌‌లు తొలి నాలుగు అమెజాన్ ఫ్రెష్ ఆర్జర్ల పై రూ.400 వరకు క్యాష్‌‌‌‌బ్యాక్‌‌‌‌ను పొందవచ్చని ప్రకటించింది.