
హైదరాబాద్, వెలుగు: హోలీ పండుగకు సంబంధించిన వస్తువులను అమ్మడానికి ఈ–కామర్స్మార్కెట్ప్లేస్ అమెజాన్ ఇండియా హోలీ స్టోర్‌ను ప్రారంభించింది. ఇది ఈ నెల 14 వరకు అందుబాటులో ఉంటుంది. సంప్రదాయ దుస్తులు, ఆర్గానిక్ గులాల్, పండగ మిఠాయిలైన గుజియా, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ప్రీమియం స్కిన్ కేర్ ప్రొడక్టులు ఇందులో లభిస్తాయి.
చాలా ప్రొడక్టులపై డీల్స్, ఆఫర్స్ ఉన్నాయని అమెజాన్ తెలిపింది. హోలీ స్టోర్‌కు సంబంధించిన ఏవైనా ప్రశ్నలు ఉంటే అమెజాన్ యాప్‌లోని రూఫస్ఏఐ చాట్‌బాట్‌ను అడిగి తెలుసుకోవచ్చని పేర్కొంది. గులాల్, వాటర్ గన్స్ వంటి వాటి గురించి ఇది తెలియజేస్తుంది.