అమెజాన్ 41 కోట్ల సేమ్​డే డెలివరీలు

అమెజాన్ 41 కోట్ల సేమ్​డే డెలివరీలు

హైదరాబాద్​, వెలుగు: ఈ–కామర్స్​ మార్కెట్​ప్లేస్​ అమెజాన్​ఇండియా 2024లో ప్రైమ్ సభ్యులకు 41 కోట్లకు పైగా వస్తువులను అదే రోజు లేదా మరుసటి రోజు అంద చేసింది. ఫలితంగా కస్టమర్లు  గత ఏడాది సగటున రూ.3,300 పొదుపు చేశారని తెలిపింది. 

ఇది వారి ప్రైమ్ సభ్యత్వం ధర కంటే రెండు రెట్లు ఎక్కువ. అంతర్జాతీయంగా అమెజాన్​ ప్రైమ్  9 బిలియన్ యూనిట్లను అదే రోజు లేదా మరుసటి రోజు అందజేసింది. వేగంగా వస్తువులను అందించడానికి డెలివరీ, లాజిస్టిక్స్ లో భారీగా పెట్టుబడి పెట్టామని అమెజాన్ తెలిపింది. 

దాదాపు 40 లక్షలకు పైగా వస్తువులను సేమ్​డే డెలివరీ చేస్తున్నట్టు తెలిపింది. ప్రైమ్ సభ్యులకు కేవలం 4 గంటలలో  20 వేలకు పైగా ప్రొడక్టులను డెలివరీ ఇస్తున్నామని అమెజాన్ ​పేర్కొంది.