హైదరాబాద్, వెలుగు: సిటీలోని 500 లోకల్ స్టోర్లు, తెలంగాణలో 800 స్టోర్లు ఇప్పుడు అమెజాన్ పే స్మార్ట్ స్టోర్లుగా మారాయని అమెజాన్ ఇండియా ప్రకటించింది. దేశం మొత్తం మీద 18 వేల మంది వ్యాపారులు అమెజాన్ పే భాగస్వాములైనట్లు వెల్లడించింది. ఆఫ్లైన్లో కార్యకలాపాలు చేస్తున్న చిన్న వ్యాపారులకు డిజిటల్ సొల్యూషన్స్ అందించాలనేదే తమ లక్ష్యమని పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాలలో మొత్తం 4 వేల స్టోర్లు అమెజాన్ పే స్మార్ట్ స్టోర్లుగా ఉన్నాయని, చిన్న వ్యాపారులందరికీ అప్పులు దొరికేలా తాము చొరవ తీసుకుంటున్నామని అమెజాన్ పే డైరెక్టర్ గిరీష్ క్రిష్ణన్ చెప్పారు. ఈ ప్రోగ్రామ్ను 2020లో మొదలు పెట్టినట్లు పేర్కొన్నారు.