ఈ కామర్స్ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం.. అమెజాన్ కస్టమర్ల సెక్యూరిటీ, షాపింగ్ మరింత సులభం చేసేందుకు కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఆన్ లైన్ షాపింగ్ చేస్తు్న్నప్పుడు కస్టమర్ల సెక్యూరిటీ మెరుగుపర్చడంలో మరో ముందడుగు వేసింది. బ్రౌజర్లు, iOS మొబైల్ షాపింగ్ యాప్ కోసం పాస్ కీ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా అమెజాన్ సెట్టింగ్ లలో పాస్ కీ సెటప్ చేసుకోవచ్చు. అంటే అమెజాన్ ఖాతాలను ఓపెన్ చేయడానికి ఫేస్ రికగ్నిషన్, ఫింగర్ ప్రింట్స్, పిన్ సెటప్ ద్వారా సెక్యూరిటీని మరింత మెరుగు పరుస్తోంది అమెజాన్.
ఈ కొత్త ఫీచర్ ఇప్పుడు వెబ్ బ్రౌజర్లను ఉపయోగించే అమెజాన్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది. ఇది iOS అమెజాన్ షాపింగ్ యాప్ లో కూడా పరిచయం చేయబోతున్నారు. త్వరలో ఆండ్రాయిడ్ వెర్షన్ కి మద్దతునిచ్చే యోచనలో ఉన్నారు.
Also Read:--మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలించిన కేంద్ర బృందం
పాస్ కీ ఎలా పనిచేస్తుంది ..
పాస్ కీల ద్వారా ఇప్పుడు ఉపయోగించే పాస్ వర్డ్ ల కన్నా ఎక్కువ ప్రయోజనం ఉంది. ఎందుకంటే వీటిని అంత సులభంగా ఊహించని విధంగా ఉంటాయి. దీని ద్వారా అనధికార యాక్సెస్ ప్రమాదం తగ్గుతుంది. ఈ పాస్ కీలలో సులభమైన పుట్టిన రోజు, పేర్లు వంటి సులభమైన పాస్ కీలను అనుమతించదు. కస్టమర్ల ఫింగర్ ప్రింట్స్, ఫేస్ స్కాన్ లేదా లాక్ స్క్రీన్ పిన్ ద్వారా తమ డివైజ్ లను అన్ లాక్ చేసిన విధంగానే పాస్ కీలను ఉపయోగించి యాప్ లు, వెబ్ సైట్ లను సైన్ ఇన్ చేయొచ్చు. ఈ విధానం ద్వారా పాస్ వర్డ్ లు, టెక్ట్స్ మేసేజ్ ల ద్వారా డెలివరీ చేయబడిన వన్ టైమ్ కోడ్ లతో పోలిస్తే అదనపు భద్రతను అందిస్తుంది.