AI స్టార్టప్‌లో అమెజాన్ పెట్టుబడులు.. టెక్ పరిశ్రమకు శుభవార్త కానుందా..

AI స్టార్టప్‌లో అమెజాన్ పెట్టుబడులు.. టెక్ పరిశ్రమకు శుభవార్త కానుందా..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పెట్టుబడులు పెడుతున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆంత్రోపిక్స్ లో 4 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ప్రకటిం చింది. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు వ్యాపార వృద్ధిలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తో ప్రయోజనాలు పొందేందుకు పోటీపడుతున్న నేపథ్యంలో అమెజాన్ ఈ ప్రకటన చేసింది. ఆంత్రోపిక్ అత్యంత ఆశాజనకమైన AI స్టార్టప్‌లలో ఒకటి. ఇది Google కు చెందిన బార్డ్, మైక్రోసాఫ్ట్- కు చెందిన OpenAI వంటివి AI-ఆధారిత టెక్స్ట్ అనలైజింగ్ చాట్‌బాట్‌ను నిర్వహి స్తుంది. ఆంత్రోపిక్ లో పెట్టుబడులతో మైక్రోసాఫ్ట్, గూడుల్ లతో పోటీపడేందుకు సిద్ధమవుతోంది. 

ఇది మొత్తం టెక్నాలజీ పరిశ్రమకు ఎందుకు శుభవార్త అవుతుందంటే.. 
అమెజాన్ ఉద్యోగులు,  క్లౌడ్ కస్టమర్ల డీల్‌లో భాగంగా ఆంత్రోపిక్.. సేఫ్టీ రీసెర్చ్, ఫ్యూచర్ ఫౌండేషన్ మోడల్ డెవలప్ మెంట్ సహా మిషన్ క్రిటికల్ వర్క్ లోడ్ కోసం ప్రాథమిక క్లౌడ్ ప్రొవైడర్గా అమెజాన్ క్లౌడ్ దిగ్గజం AWS ను వినియోగించుకుంటుందని ఈ కామర్స్ గ్రూప్ తెలిపింది. ఇది Amazon Trainium, Inferentia కంప్యూటర్ చిప్‌లను ఉపయోగించి దాని కొత్త మోడల్‌లను నిర్మిస్తుంది, శిక్షణ ఇస్తుంది ,అమలు చేస్తుందని ఆంత్రోపిక్ తెలిపింది. AI- సాంకేతికలో విజయపథంలో దూసుకుపోతున్న ప్రముఖ సంస్థ Nvidia తయారు చేసిన వాటికి ప్రత్యామ్నాయంగా వీటిని ఉంచాలని అమెజాన్ భావిస్తోంది. AIలో మిలియన్ల కొద్దీ పెట్టుబడి పెట్టే కంపెనీల్లో  Nvidia చిప్‌లకు భారీ డిమాండ్ ఉన్నందున దాని స్టాక్ ఈ సంవత్సరం దాదాపు 190శాతం  పెరిగింది.

ALSO READ : మసీదులకు పరదాలు కట్టిన పోలీసులు

బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక ప్రకారం.. "AI ఫ్రంట్‌రన్నర్ అయిన ఆంత్రోపిక్, Amazon చిప్స్‌లో అత్యాధునిక మోడల్‌లను నిర్మించి, అమలు చేయగలిగితే AIలో Nvidia సంపూర్ణ ఆధిపత్యం శాశ్వతంగా ఉండదని ఇది బలమైన సంకేతాన్ని పంపుతుంది.  ఈ సాంకేతికత అభివృద్ధి వేగంగా కొనసాగాలని కోరుకుంటున్నానని ఆంత్రోపిక్ సంస్థ తెలిపింది. 

OpenAI మాదిరిగానే ఆంత్రోపిక్ అనేది జెనరేటివ్ AI అని పిలవబడే డెవలపర్.. ఇది మానవరూప టెక్స్ట్‌లు, చిత్రాలను రూపొందించడానికి డేటా ద్వారా నేర్చుకోగల సాంకేతికత. ఈ సాధనాలు అనేక పనులను స్వయంచాలకంగా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంశాలను పునర్నిర్మించాయి కూడా.