చెబితే వింటది..చెప్పింది చేస్తది

చెబితే వింటది..చెప్పింది చేస్తది
  • అమెజాన్ రోబో డాగ్​ రెడీ 

చాలా రోజులుగా రోబోటిక్‌‌‌‌ డాగ్స్‌‌‌‌ గురించి వింటూనే ఉన్నాం. అయితే లేటెస్ట్‌‌‌‌గా అమెజాన్‌‌‌‌ కంపెనీ ఆస్ట్రో రోబో డాగ్స్‌‌‌‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. చూడ్డానికి చిన్నగా, క్యూట్‌‌‌‌గా ఉండే ఈ డాగ్స్‌‌‌‌ ఆస్ట్రో యాప్‌‌‌‌ ద్వారా పని చేస్తాయి. వాటికవే ఇంటా బయటా పెట్రోలింగ్‌‌‌‌ చేస్తాయి. మీకెంతో ఉపయోగపడతాయి. వీటి ధర కూడా1,500 డాలర్లు మాత్రమే అంటోంది అమెజాన్‌‌‌‌. అయితే వీటితో పాటే అమెజాన్‌‌‌‌ మరో 14 గ్యాడ్జెట్‌‌‌‌లను ప్రవేశపెడుతూ.. ఈ రోబో ఆస్ట్రో డాగ్స్‌‌‌‌ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్‌‌‌‌ విషయాలు చెప్పింది. ఈ రోబో డాగ్‌‌‌‌లో ఆస్ట్రో యాప్‌‌‌‌ని డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసి వదిలేస్తే వాటంతట అవే పనిచేస్తాయట. మనం సూచించిన ప్రదేశాల్లో తిరుగుతూ అక్కడ ఏదైనా ప్రమాదం ఉంటే హెచ్చరిస్తాయని.. ఎలా చెబితే అలా వింటాయని కంపెనీ చెబుతోంది. అంతేకాదు కొత్తవాళ్లు ఎవరైనా ఇంటి లోపల దూరితే సాధారణ డాగ్‌‌‌‌ లానే అవి కూడా స్పందించి వెంటనే మనల్ని అలర్ట్​ చేస్తాయట. ఇంకా బెడ్‌‌‌‌ రూమ్‌‌‌‌, కిచెన్‌‌‌‌, బాత్‌‌‌‌ రూమ్‌‌‌‌ ఇలా వీటిని ఎక్కడైనా వాడుకోవచ్చట. ఎక్కడికి జర్నీ చేస్తే అక్కడికి వెంటేసుకుని పోవచ్చట. చిన్నారులు కూడా ఈ క్యూట్‌‌‌‌ డాగ్స్‌‌‌‌ను ఎక్కువ లైక్‌‌‌‌ చేస్తారని, వాళ్లకి మంచి ఎకో ఫ్రెండ్లీగా ఉంటాయని కూడా కంపెనీ చెబుతోంది.  ఇంకేం డాగ్‌‌‌‌ ప్రియులకి ఇది పండగే.. త్వరలోనే ఈ ఎకో ఫ్రెండ్లీ రోబో  డాగ్స్‌‌‌‌ను వెంటేసుకుని ఎంచక్కా తిరగొచ్చన్నమాట.