అలెస్కా (Alexa) నుంచి ఉద్యోగులు ఔట్.. అంతా AI పుణ్యమే

అలెస్కా (Alexa) నుంచి ఉద్యోగులు ఔట్.. అంతా AI పుణ్యమే

అమెజాన్ లేఆఫ్స్ కొనసాగిస్తోంది. గత కొన్ని నెలలుగా అనేక AI కార్యక్రమాలను  అమలు చేస్తున్న అమెజాన్..కస్టమర్ సమీక్ష నుంచి డెవలపర్, దాని AWS క్లౌడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లో వారి సొంత AI టెక్నాలజీని ఉపయోగించడం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా అమెజాన్ తన ప్రముఖ వాయిస్ అసిస్టెంట్ అలెక్సాను నిర్వహించే యూనిట్ లో వందలాది ఉద్యోగులను తొలగిస్తోంది. శుక్రవారం (నవంబర్17) ఉద్యోగులకు లేఆఫ్స్ నోటీస్ విడుదల చేసింది.

కస్టమర్ల కు మరిన్ని సేవలు, AI పై ఎక్కువ దృష్టి సారించడంతో కంపెనీకు చెందిన కొన్ని కార్యక్రమాలను పూర్తి తొలగించాం..అందులో పనిచేసే ఉద్యోగులను కూడా తొలగిస్తున్న అమెజాన్ అలెక్సా ఫైర్ టీవీ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ చెప్పారు. ఎన్ని ఉద్యోగాలు తొలగిస్తున్నారు అనేది స్పష్టం గా తెలపలేదు. ఇది అమెరికా, కెనడా, భారత్ లోని ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని చెప్పారు.

ఉత్పాదక AI క్రేజ్ ను ఉపయోగించుకునేందుకు ఇతర కంపెనీలతో సీటెల్ ఆధారిత అమెజాన్ పోటీ పడుతోంది. గత కొన్ని నెలల్లో అనేక AI కార్యక్రమాలను అమలు చేస్తోంది. టెక్నాలజీ సమీక్ష, డెవలపర్, దాని AWS క్లౌడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లో వారి సొంత AI సాధనాలను రూపొందించేందుకు అనుమతించే సేవలను అందించడం వరకు AI ని విస్తృతంగా వాడుతోంది. 

2023 సెప్టెంబర్ లో అలెక్సా మరిన్ని ఉత్పదక AI లక్షణాలతో ఆధునీకరణను ప్రకటించింది. అమెజాన్ గేమింగ్, మ్యూజిక్ టీమ్ లలో ఇటీవల తొలగింపులను చేపట్టింది. గతేడాది (2022) చివరి భాగం, ఈఏడాది ప్రారంభం ( 2023) లో 27వేల మంది ఉద్యోగులను తొలగించింది. అమెజాన్ అలెక్సా యూనిట్ తొలగింపులు కూడా అందులో భాగమేనని కంపెనీ తెలిపింది.