
ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న హర్‌ప్రీత్ గిల్ అనే వ్యక్తి దుండగుల కాల్పుల్లో చనిపోయాడు. న్యూఢిల్లీకి చెందిన ఈ 36 ఏళ్ల హర్‌ప్రీత్.. తన స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఐదుగురు వ్యక్తులు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఆగస్టు 29న అర్థరాత్రి చోటుచేసుకుంది.
ALSO READ : ఈ కొండ ఏడు రంగుల్లో ఉంటుంది.. ప్రకృతి వింతల్లోనే అద్భుతం ఇది
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భజన్‌పురా ప్రాంతంలోని సుభాష్ విహార్ సమీపంలో స్నేహితులిద్దరూ మోటార్‌బైక్‌పై వెళ్తుండగా దుండగులు అడ్డగించారు. అనంతరం కాల్పులు జరపగా.. అందులో ఒక బుల్లెట్ హర్‌ప్రీత్ తలకు తగిలి, అతను అక్కడికక్కడే మరణించాడు. అతని స్నేహితుడు గోవింద్ సింగ్ కుడి చెవికి బుల్లెట్ గాయమైంది. ప్రస్తుతం అతను LNJP ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితులంతా పరారీలో ఉన్నారని, వారిని గుర్తించేందుకు పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని స్కాన్ చేస్తున్నారు.