ఐపీఓకు అమెజాన్​

ఐపీఓకు అమెజాన్​

న్యూఢిల్లీ:ఈ–కామర్స్​ మార్కెట్​ప్లేస్​అమెజాన్​తన ఇండియా యూనిట్​ ఐపీఓను ప్రారంభించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఇండియన్​ఇన్వెస్ట్​మెంట్​ బ్యాంకులతో చర్చలు జరుపుతోందని సమాచారం. 

ఇవి ప్రాథమిక దశలోనే ఉన్నాయని అంటున్నారు. ఐపీఓకు వస్తే డేటాను స్థానికంగానే నిల్వ చేయవచ్చు. ఇండియాలోనే స్టాక్​ను పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుత రూల్స్​ ప్రకారం దేశీయ ఈ–కామర్స్​ కంపెనీలు మాత్రమే ఇన్వెంటరీ బేస్​మోడల్​విధానంలో వ్యాపారం చేయాలి. 

అంటే స్టాక్​ను నిల్వ చేసి వేగంగా డెలివరీ చేయవచ్చు. దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గుతాయి. ఫారిన్​ కంపెనీలు మార్కెట్​ప్లేస్​ మోడల్​ను అనుసరించాలి. కేవలం సెల్లర్లకు, బయర్లకు మధ్య సమన్వయం చేయాలి.   ఈ–కామర్స్​ మార్కెట్లో ఫ్లిప్​కంటే అమెజాన్​ కాస్త వెనకబడి ఉంది.