![Amazon Offers:ప్రీమియం స్మార్ట్టీవీలపై 70 శాతం డిస్కౌంట్](https://static.v6velugu.com/uploads/2025/02/amazon-offering-upto-70percent-discount-on-premium-smart-tvs-from-sony-samsung-acer-tcl_STU4CJZjpI.jpg)
మీరు స్మార్ట్టీవీ కొనాలనుకుంటున్నారా..బిగ్ సైజ్ టీవీ తక్కువ ధరలో కావాలనుకుంటున్నారా..స్మార్ట్ టీవీలను బెస్ట్ ఆఫర్లకోసం ఎదురుచూస్తున్నారా.. అయితే మీకో గుడ్న్యూస్..అమెజాన్ ప్రీమియం స్మార్ట్ టీవీలపై ధరలను తగ్గించింది, ఇప్పుడు ప్రముఖ బ్రాండ్లకు చెందిన ప్రీమియం స్మార్ట్ టీవీలు దాదాపు70 శాతం వరకు డిస్కౌంట్లతో లభిస్తున్నాయి. వీటిలో Samsung, Sony, TCL, Acer, Vu మరియు Hisense వంటి అగ్ర బ్రాండ్‌లు ఉన్నాయి. ఇందులో 4K,8K అల్ట్రా HD డిస్‌ప్లేలు, AI టెక్నాలజీతో సౌండ్ టెక్నాలజీలు ఉన్నాయి.
ప్రస్తుతం హై-డెఫినిషన్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు డిమాండ్ పెరుగుతోంది. నెక్ట్స్ జనరేషన్ స్మార్ట్ టీవీలకు అప్‌గ్రేడ్ కావాలనుకునే కస్టమర్లకు ఇది మంచి అవకాశం. ధర తగ్గింపులతో పాటు, అమెజాన్ ప్రీమియం టీవీలను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు నెలకు రూ. 750తో ప్రారంభమయ్యే నో-కాస్ట్ EMI ప్లాన్‌లను కూడా అందిస్తోంది.
టాప్ ప్రీమియం టీవీలు- భారీ డిస్కౌంట్లు
TCL స్మార్ట్ టీవీ(85 ఇంచెస్) ధర, స్పెసిఫికేషన్లు
TCL స్మార్ట్ టీవీ 85-అంగుళాల C655 4K అల్ట్రా HD స్మార్ట్ QLED TV మోడల్.. ఈ ప్రీమియం టీవీపై 71శాతం తగ్గింపు ఉంది.. ఈ టీవీ అసలు ధర లక్షా 24వేల 990లు. డిస్కౌంట్ తర్వాత 46వేల 990లు.
- రిజల్యూషన్: 4K అల్ట్రా HD (3840 x 2160)
- ఫీచర్లు: క్వాంటం డాట్, డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్
- స్మార్ట్ OS: Google TV, Google Assistant, Chromecast
- గేమింగ్: 120Hz రిఫ్రెష్ రేట్, గేమ్ మోడ్
Acer 85- ఇంచెస్ స్మార్ట్ టీవీ ధర, స్పెసిఫికేషన్లు
Acer 85 85అంగుళాల సూపర్ సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ QLED TV మోడల్ పై 40శాతం తగ్గింపు ఉంది. దీని అసలు ధర రూ. 2లక్షల 49వేల 999 లు. డిస్కౌంట్ తర్వాత ధర రూ. లక్షా 49వేల 999 లు.
- రిజల్యూషన్: 4K అల్ట్రా HD (3840 x 2160)
- ఫీచర్లు: క్వాంటం డాట్, HDR10+, డాల్బీ అట్మాస్
- స్మార్ట్ OS: Google TV, హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ కంట్రోల్
- గేమింగ్: ఆటో తక్కువ లేటెన్సీ మోడ్ (ALLM), వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (VRR)
Samsung 85- ఇంచెస్ ప్రీమియం స్మార్ట్ టీవీ ధర, స్పెసిఫికేషన్లు
Samsung 85 అంగుళాల 8K అల్ట్రా HD స్మార్ట్ నియో QLED TV మోడల్ పై 15% తగ్గింపు ఉంది.
- రిజల్యూషన్: 8K అల్ట్రా HD (7680 x 4320)
- ఫీచర్లు: క్వాంటం మ్యాట్రిక్స్ టెక్నాలజీ, డాల్బీ అట్మోస్, ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ ప్రో
- స్మార్ట్ OS: Tizen OS, Alexa & Bixby సపోర్ట్
- గేమింగ్: 144Hz రిఫ్రెష్ రేట్, FreeSync ప్రీమియం ప్రో
Sony BRAVIA 9 సిరీస్ స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్లు..
Sony BRAVIA 9 సిరీస్ 85-అంగుళాల 4K అల్ట్రా HD AI స్మార్ట్ మినీ LED TV మోడల్ పై 39% తగ్గింపు లభిస్తోంది.
- రిజల్యూషన్: 4K అల్ట్రా HD (3840 x 2160)
- ఫీచర్లు: కాగ్నిటివ్ ప్రాసెసర్ XR, డాల్బీ విజన్, XR ట్రిలుమినోస్ ప్రో
- స్మార్ట్ OS: Google TV, Apple AirPlay, Chromecast అంతర్నిర్మిత
- గేమింగ్: HDMI 2.1, 120Hz రిఫ్రెష్ రేట్