బంపర్ ఆఫర్..అమెజాన్ AI కోర్సులను ఉచితంగా నేర్పిస్తోంది..

బంపర్ ఆఫర్..అమెజాన్ AI కోర్సులను ఉచితంగా నేర్పిస్తోంది..

ఈ కామర్స్ దిగ్గజం.. అమెజాన్ ఉత్పాదక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై దృష్టి సారించింది. ప్రస్తుతం టెక్ రంగాన్ని ఓ ఊపు ఊపేస్తున్న ఉత్పాదక AI  టెక్నాలజీలో  శిక్షణ ఇచ్చేందుకు కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా Amazon AI Ready అనే ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. AI  ప్రతిభకు డిమాండ్, అధిక వేతనాలను దృష్టిలో పెట్టుకొని  AI విద్యను అందుబాటులోకి తీసుకొస్తోంది.  2025 నాటికి ప్రపంచ వ్యాప్తంగా రెండు మిలియన్ల మందికి శిక్షణ ఇచ్చే లక్ష్యంతో Amazon మూడు ప్రోగ్రామ్ లను ప్రవేశపెడుతోంది. అమెజాన్ కోర్సుల గురించి తెలుసుకుందాం. 

1. ఉచిత AI, జరేటివ్ AI కోర్సులు 

అమెజాన్ AI, ఉత్పాదక AIని కవర్ చేసే 8 ఉచిత కోర్సులను అందిస్తోంది. ఈ కోర్సులు ఫౌండేషన్ నుంచి ఆధునాతన టెక్నాలజీ నిపుణుల స్థాయి వరకు వివిధ స్కిల్స్ ను అందిస్తోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ద్వారా అందుబాటులో ఉన్న 80కి పైగా ఉచిత, AI సోర్సెస్ ను ఈ కోర్సుల ద్వారా నేర్చుకోవచ్చు. 

2.ఈ కోర్సులకు అమెజాన్ స్కాలర్ షిప్, సహకారం

ఈ కోర్సును చేయదలుచుకున్న విద్యార్థులకు అమెజాన్ AWS జనరేటివ్ AI స్కాలర్ షిప్ ను కూడా ఇస్తోంది. దీంతోపాటు Code.orgతో సహకారం AI పై విద్యార్థుల అవగాహనను పెంపొందించడం, ఈ రంగంలో ఫ్యూచర్ టాలెంట్ ను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. 

వ్యాపారులు,  టెక్నాలజీ లేని వారి కోసం అమెజాన్ .. ఉత్పాదక AI పై పరిచయ కోర్సులను అందిస్తోంది. ప్రాజెక్టు ప్లానింగ్ ను కవర్ చేయడం, ఉత్పాదక AI రెడీ ఆర్గనేజేషన్ రూపొందించడం వంటి మూడు కోర్సుల సిరీస్ ను అందిస్తుంది. డెసిషన్ మేకర్స్ కోసం జనరేటివ్ AI లెర్నింగ్ ప్లాన్ కూడా అందుబాటులోకి తెచ్చింది. 
డెవలపర్స్, టెక్నికల్ పర్సన్స్ కోసం  ప్రాంప్ట్ ఇంజనీరింగ్ బేసిక్స్, AWS లో తక్కువ కోడ్ మిషీన్ లెర్నింగ్, AWS లో LLms  నిర్మించడం, అమెజాన్ Bedrock ని ఉపయోగించి ఉత్పాదక AI అప్లికేషన్లను సృష్టించే కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 

ఉత్పాదక AI శిక్షణ ప్రొగ్రామ్స్ ప్రవేశపెట్టిన అమెజాన్.. ప్రత్యేకంగా AI టెక్నాలజీని వినియోగం లో ఇతర కంపెనీలతో పోటీ పడుతూ బిజినెస్ డెవలప్ మెంట్ లో ముందుకు సాగుతోంది.. ఏది ఇటీవల  ఏమైనా ప్రస్తుత టెక్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న AI  నేర్చుకొని ఉద్యోగాలు పొందాలనుకునేవారికి ఇదో అవకాశం..