GameChanger: కళ్లు చెదిరే ధరకు గేమ్ ఛేంజ‌ర్ ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటంటే?

GameChanger: కళ్లు చెదిరే ధరకు గేమ్ ఛేంజ‌ర్ ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్(Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ సక్సెస్ తరువాత రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే రిలీజ్ చేసిన ఫస్ట్ లిరికల్ జరగండి, సెకండ్ లిరికల్ రా మచ్చా మచ్చా సాంగ్స్ అదిరిపోయాయి. వీటితో ఫ్యాన్స్ మస్తు ఖుషీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గేమ్ ఛేంజర్ ఓటీటీ రైట్స్‌ రికార్డ్ ధ‌ర‌కు అమ్ముడుపోయినట్లు టాలీవుడ్ సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. 

గేమ్ ఛేంజర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిన‌ట్లు సమాచారం. అందుకు రూ.110 కోట్లు వెచ్చించి మరి సౌత్ లాంగ్వేజెస్ డిజిట‌ల్ రైట్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఈ మూవీ కోసం ఎన్నో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పోటీ పడగా ఆఖరుకు అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందని ఇన్‌సైడ్ టాక్.

అలాగే హిందీ డిజిట‌ల్ రైట్స్ ను మరో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ దక్కించుకున్నట్లు టాక్. దీంతో మొత్తంగా ఓటీటీ ద్వారానే మేక‌ర్స్‌కు రూ.150 కోట్ల రూపాయ‌ల వరకు వచ్చినట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇకపోతే సుమారు రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమాకు ఓటీటీ, శాటిలైట్, థియేటర్స్ అన్ని కలిపి భారీగా బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.

ఈ సినిమాలో డైరెక్టర్ శంకర్ సాంగ్స్ తెరకెక్కించడం కోసం దాదాపు రూ.90 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. కేవలం జరగండి జరగండి ఒక్క సాంగ్ కోసం రూ.16 కోట్లు వెచ్చించారట. అలాగే రా మచ్చా సాంగ్ కోసం కూడా భారీగానే పెట్టినట్లు కనబడుతోంది. భారీ విజువల్స్ తో వచ్చే గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది.