అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఫ్రీ గా పొందాలంటే..

అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఫ్రీ గా పొందాలంటే..

ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌ డిస్కౌంట్లు, ఎక్స్‌చేంజ్ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. అమేజాన్ ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రైమ్ డే సేల్ ఇవాళ్టితో ముగియనుంది. ఇందులో భాగంగా ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకునే అవకాశం కల్పించింది. అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం తీసుకుంటే వివిధ రకాల సేవలు ఉచితంగా పొందొచ్చు. ఫాస్ట్ ఫ్రీ డెలివరీ, అన్‌లిమిటెడ్ స్ట్రీమింగ్ సర్వీసులు, ముందుగానే ఎక్స్‌క్లూజివ్ డీల్స్ యాక్సెస్ వంటి సేవలు లభిస్తాయి. దీని కోసం సంవత్సరానికి రూ.999 చెల్లించాల్సి ఉంటుంది.

అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను వొడాఫోన్, ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్ఎల్ కంపెనీలు తన కస్టమర్లకు  ఫ్రీగా అందిస్తున్నాయి.

ఎయిర్‌టెల్ తన ఎయిర్‌టెల్ థ్యాంక్స్ కార్యక్రమంలో భాగంగా ప్రిపెయిడ్, పోస్ట్ పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు ఏడాదిపాటు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తోంది. రూ.299 రీచార్జ్ ప్లాన్ కలిగినవారు, రూ.499, ఆపైన ఇన్‌ఫినిటీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ ఉన్న యూజర్లు.. రూ.1,099 ,ఆపైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఉన్న వారికి ఈ సేవలు వర్తిస్తాయి. అమెజాన్ ప్రైమ్ కోసం ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. మరోవైపు BSNL కూడా ఏడాది అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఫ్రీగా అందిస్తోంది. రూ.399, ఆపైన పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ కలిగి వారికి, రూ.745, ఆపైన ల్యాండ్‌లైన్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ఉన్న వారికి ఈ సేవలు లభిస్తాయి. BSNL వెబ్‌సైట్‌కు వెళ్లి అమెజాన్ ప్రైమ్ కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

వొడాఫోన్ కంపెనీ కూడా ఏడాది అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది. వొడాఫోన్ రెడ్ పోస్ట్‌పెయిడ్ యూజర్లకు మాత్రమే ఈ సేవలు లభిస్తాయి. రూ.399, ఆపైన ప్లాన్లకు ఇది వర్తిస్తుంది. యూజర్లు వొడాఫోన్ ప్లే యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

అమెజాన్ ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల్లో ప్రైమ్ డే సేల్ నిర్వహిస్తోంది.