న్యూఢిల్లీ: ఈ–కామర్స్కంపెనీ అమెజాన్ ప్రైమ్ డే సేల్‌ను ఈ నెల 20 నుంచి 21 వరకు నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా శామ్సంగ్, ఆపిల్, రియల్మీ, సోనీ, అసూస్ కంపెనీల ఫోన్లు, యాక్సెసరీలు, ఎకో పరికరాలపై డిస్కౌంట్లు, ఆఫర్లు ఇస్తామని ప్రకటించింది. వంటగది సామాన్లు, ఫ్యాషన్‌పైనా తగ్గింపులు ఉంటాయని తెలిపింది. ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో కొంటే 10 శాతం ఇన్స్టంట్డిస్కౌంట్ ఇస్తారు. అమెజాన్‌పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌లతో షాపింగ్చేసే ప్రైమ్కస్టమర్లు రూ. 2,500 వరకు రివార్డ్‌లు, రూ. 300 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా 5 భాషల్లో 14 కొత్త సిరీస్‌లను, చిత్రాలను కూడా విడుదల చేయనుంది. వీటిలో మీర్జాపూర్ సీజన్ 3, ది బాయ్స్ సీజన్ 4 ఉన్నాయి. వీటితో పాటు ఫెడరర్: ట్వెల్వ్ ఫైనల్ డేస్, సివిల్ వార్, పీటీ సర్, నాచ్ గ ఘుమా, గం గం గణేశ, మై లేడీ జేన్, శర్మజీ కి భేటీ కూడా ప్రసారమవుతాయి. ప్రైమ్ డే సేల్ సందర్భంగా మోటో రేజర్ అల్ట్రా ఫోల్డబుల్, హానర్ 200, ఐకూ జెడ్9 లైట్, శామ్సంగ్ గెలాక్సీ ఎం35, లావా బ్లేజ్ఎక్స్ఫోన్లను లాంచ్‌చేయనుంది.