ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ లో ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day Sale) సందడి మొదలైంది. జులై 20 నుంచి 21 వరకూ ప్రైమ్ డే సేల్ కొనసాగనుంది. ప్రైమ్ మెంబర్స్కు మాత్రమే అందుబాటులో ఉండే ఈ సేల్ లో పలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్పై అమెజాన్ భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. ఫలితంగా కొన్ని స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, టీవీలు, స్మార్ట్ వాచ్ల ధరలపై ప్రైమ్ డే సేల్లో భారీ తగ్గింపు కనిపించింది.శామ్ సంగ్ గెలాక్స్ M35 5G స్మార్ట్ ఫోన్ 24,499 నుంచి 19999 రూపాయలకు తగ్గింది. అదనంగా మరో 1000 రూపాయలు లభించనుంది. iQOO Z9 Lite 5G స్మార్ట్ ఫోన్ రూ.14,499 నుంచి 10,499 రూపాయలకు తగ్గింది. 50 మెగాపిక్సెల్ సోనీ ఏఐ కెమెరాతో iQOO Z9 Lite 5G స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. Redmi 13 5G (6+128GB) స్మార్ట్ ఫోన్ ధర రూ.17,999 నుంచి 13,999 రూపాయలకు తగ్గింది.
HONOR 200 5G స్మార్ట్ ఫోన్ రూ.32,999, Motorola razr 50 ultra స్మార్ట్ ఫోన్ 94,999, boAt Nirvana Space ANC Earbuds రూ.1,999, HP Pavilion 16 Laptop రూ.89,990, Sony BRAVIA 3 55 inches 4K Google TV రూ.78,999, Titan Smart Celestor 8,995 రూపాయలకు ప్రైమ్డేలో భాగంగా అమెజాన్లో అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 13పై కూడా ప్రైమ్ డే సేల్ లో భారీ డిస్కౌంట్ ప్రకటించారు. 59,900 రూపాయల ఐఫోన్ 13ను ప్రైమ్ డేలో 48,999 రూపాయలకే సేల్లో ఉంచారు. ఐ ఫోన్ 13 కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఇది కచ్చితంగా ఒక సదవకాశం అని చెప్పొచ్చు.
ALSO READ : రిలయన్స్ రెవెన్యూ రూ.2.58 లక్షల కోట్లు
Oneplus 12 (12+256 GB) స్మార్ట్ ఫోన్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో 59,999 రూపాయలకు లభిస్తుంది. Dell 15 Intel i5 12th Gen Laptop 44,990 రూపాయలకే ప్రైమ్ డేలో అందుబాటులో ఉంచారు. వన్ ప్లస్ బడ్స్ పై కూడా ఈ సేల్ లో డిస్కౌంట్ ప్రకటించారు.రూ.3699 ఖరీదు కలిగిన OnePlus Nord Buds 3 Pro అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో 3,299 రూపాయలకే ఆర్డర్ చేసుకోవచ్చు. ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంకు కార్డులపై 10 శాతం, రూ.2500 వరకూ డిస్కౌంట్ పొందే అవకాశం ఈ ప్రైమ్ డే సేల్లో అమెజాన్ కల్పించింది. అమెజాన్ యూపీఐ ద్వారా పే చేస్తే 1000 రూపాయల ఆర్డర్పై 100 రూపాయల తగ్గింపు లభించనుంది.స్మార్ట్ ఫోన్స్పై 40 శాతం, ట్యాబ్స్పై 60 శాతం, కిచెన్ వస్తు సామాగ్రిపై 80 శాతం, క్లాత్స్పై 60 శాతం, హోం అప్లియన్సెన్పై 65 శాతం వరకూ డిస్కౌంట్ను ప్రైమ్ డే సేల్లో భాగంగా అమెజాన్ ప్రకటించింది.