ఆన్ లైన్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు షాకిచ్చింది. సబ్‌స్ర్కిప్షన్ చార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఏకాంగా 67 శాతం పెంచిన అమెజాన్.. త్రైమాసిక ప్లాన్‌నూ పెంచేసింది. వార్షిక ప్లాన్ మాత్రం యధాతథంగా కొనసాగిస్తున్నది. పెరిగిన చార్జీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆ సంస్థ తెలిపింది. అయితే కొత్త యూజర్లకు మొదటి నెల ఉచితంగానే సబ్‌స్ర్కిప్షన్ అందుబాటులో ఉంది. ఆ తర్వాతే ప్లాన్ చార్జీల మేరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే సబ్‌స్ర్కైబ్ అయిన వారికి 2024 జనవరి 15 వరకు పాత చార్జీలే వర్తిస్తాయి.
ఇక అమెజాన్ ప్రైమ్ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఇప్పటి వరకు రూ.179 కాగా, తాజాగా రూ.299లకు పెంచుతున్నట్లు అమెజాన్ సంస్థ వెల్లడించింది. 3 నెలల సబ్‌స్క్రిప్షన్ రూ.459 నుంచి 599కి పెంచివేసింది. వార్షిక సబ్‌స్క్రిప్షన్ రూ.1499. యధాతథంగా కొనసాగిస్తున్నది. ఇక రూ.999లకే అమెజాన్ లైట్ వార్షిక సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. ఈ ఆప్షన్‌లో ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ సదుపాయాలన్నీ వర్తించినా.. ప్రైమ్ వీడియో కంటెంట్ ఎస్‌డీ క్వాలిటీలో మాత్రమే చూడటానికి వీలు ఉంది.